అలా రెండో సినిమా | akathaee hero new movie started | Sakshi
Sakshi News home page

అలా రెండో సినిమా

Apr 22 2017 12:23 AM | Updated on Sep 5 2017 9:20 AM

అలా రెండో సినిమా

అలా రెండో సినిమా

‘ఆకతాయి’తో హీరోగా పరిచయమైన ఆశిష్‌ రాజ్‌కు మరో ఛాన్స్‌ వచ్చింది. ‘ఆకతాయి’ను నిర్మించిన వీకేఏ ఫిల్మ్స్‌ సంస్థే ...

‘ఆకతాయి’తో హీరోగా పరిచయమైన ఆశిష్‌ రాజ్‌కు మరో ఛాన్స్‌ వచ్చింది. ‘ఆకతాయి’ను నిర్మించిన వీకేఏ ఫిల్మ్స్‌ సంస్థే ఈ సినిమానూ నిర్మించనుంది. మే నెలలో ఈ సినిమా ప్రారంభం కానుంది. నిర్మాతలు కేఆర్‌ విజయ్‌ కరణ్, కేఆర్‌ కౌశల్‌ కరణ్, కేఆర్‌ అనిల్‌ కరణ్‌ మాట్లాడుతూ– ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన మా ‘ఆకతాయి’ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.

ఆ సినిమాకు వచ్చిన ప్రేక్షకుల స్పందన చూసి రెండో సినిమాకు శ్రీకారం చుడుతున్నాం. యువ ప్రతిభాశాలి దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఆగస్టులో మొదలు పెడతాం. ఆశిష్‌ సరసన ప్రముఖ హీరోయిన్‌ నటిస్తారు. పూర్తి వివరాలు త్వరలోనే చెబుతాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement