మలేసియాలో ప్రేమ | akash in Love in Malaysia | Sakshi
Sakshi News home page

మలేసియాలో ప్రేమ

Published Sat, Jun 7 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

మలేసియాలో ప్రేమ

‘‘ఇప్పటివరకు లవర్‌బోయ్, కామన్ మేన్ పాత్రలు చేశాను. వాటికి భిన్నంగా ఇందులో ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేశాను. శాటిలైట్ రైట్స్, బిజినెస్‌ని దృష్టిలో పెట్టుకుని కాకుండా నాణ్యత గల సినిమా చేయాలనే తపనతో చేశాం. సినిమా బాగా వచ్చింది’’ అని     జై ఆకాష్ చెప్పారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ ఇన్ మలేసియా’.

సంగీత, గెహనా వశిష్ట్, రమ్య నాయికలుగా ఈ చిత్రాన్ని గణేశ్ దొండి నిర్మించారు. సుమన్ జూపూడి స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. గణేశ్ దొండి మాట్లాడుతూ - ‘‘కథానుసారం ఎక్కువ శాతం షూటింగ్‌ని మలేసియాలో చేశాం. మంచి కథ, పాటలు, ఆకాశ్ డెరైక్షన్.. ఈ సినిమా విజయానికి దోహదపడతాయి’’ అని చెప్పారు. మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ ఇదని సంగీతదర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నరేశ్ .బి.

Advertisement
 
Advertisement
 
Advertisement