హద్దులు దాటిన అభిమానం.. హీరో డెత్‌ డేట్‌ అంటూ!

Ajith and Vijay Fan Rivalry Continues - Sakshi

కోలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానుల మధ్య వివాదాలు చాలా కామన్‌. ముఖ్యంగా అజిత్‌, విజయ్‌ అభిమానులు ప్రత్యక్షంగా తలపడ్డ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తాజాగా విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా మరోసారి ఫ్యాన్స్‌ వార్ తెరమీదకు వచ్చింది. ఈ నెల 22న విజయ్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని కామన్‌ డీపీని డిజైన్‌ చేయించారు దళపతి ఫ్యాన్స్‌.

అయితే ఈ డీపీ రిలీజ్ అయిన కొద్ది సేపటికే అజిత్‌ ఫ్యాన్‌ #June22VijayDeathDay (జూన్‌ 22 విజయ్‌ చనిపోయిన రోజు) అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. కొద్ది నిమిషాల్లోనే ఈ హ్యాష్‌ టాగ్‌ చెన్నై ట్రెండ్స్‌లో టాప్‌లోకి వచ్చేసింది. వెంటనే కౌంటర్‌గా విజయ్‌ ఫ్యాన్స్‌ #LongLiveThalapathy అనే ట్యాగ్‌ను ట్రెండ్‌ చేశారు. ఇలా సోషల్‌ మీడియా వేదిక అజిత్‌, విజయ్‌ ఫ్యాన్స్‌ హద్దులు దాటి హీరోలను ఇబ్బందిపెడుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top