డబుల్‌ ధమాకా

Ajay Devgn to play Phoolan Devi's assassin in his next film? - Sakshi

ప్రస్తుతం బాలీవుడ్‌ అంతా బయోపిక్‌ల హవా నడుస్తోంది. అజయ్‌ దేవగన్‌ కూడా బయోపిక్‌కి రెడీ అయ్యారు. ఒకటి కాదు ఏకంగా రెండు బయోపిక్‌లను లైన్‌లో పెట్టారు. మరాఠా సామ్రాజ్యంలోని ముఖ్య జనరల్‌ తానాజీ, పూలన్‌దేవిని చంపిన బందిపోటు షేర్‌ సింగ్‌ రానా పాత్రలను తెరమీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. బయోపిక్‌లో యాక్ట్‌ చేయడం అజయ్‌కి ఇది ఫస్ట్‌ టైమ్‌ ఏం కాదు. 2002లో ‘ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌సింగ్‌’ చిత్రంలో భగత్‌సింగ్‌ పాత్రలో కనిపించారు. ఆల్రెడీ ‘తానాజీ : ది అన్‌సంగ్‌ హీరో’ చిత్రంలో  తానాజీ పాత్ర కోసం ప్రిపరేషన్‌ మొదలుపెట్టేసిన అజయ్‌ దేవ్‌గన్‌.. షేర్‌ సింగ్‌ బయోపిక్‌ను వచ్చే ఏడాది చివర్లో మొదలుపెట్టనున్నారట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top