హీరో కాదు!

ajay devgan in harshad mehta biopic - Sakshi

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ మరో సినిమాకు సైన్‌ చేశారు. అయితే హీరోగా కాదు. నిర్మాతగా. ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోందని తెలిసిందే. తాజాగా స్టాక్‌ మార్కెట్‌ బ్రోకర్‌ హర్షద్‌ మెహతా జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా రూపొందనుందని బాలీవుడ్‌ టాక్‌. స్టాక్‌ మార్కెట్‌లో హర్షద్‌కి బిగ్‌ బుల్‌ అనే నిక్‌ నేమ్‌ కూడా ఉందట.

ఈ సినిమాను అజయ్‌ దేవగన్, బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఇంద్రకుమార్‌ కలిసి నిర్మిస్తారట. అయితే ఇందులో అజయ్‌ హీరోగా నటించరు. ఓ స్టార్‌ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నారట టీమ్‌. ఈ సినిమాకి కుకీ గులాటి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇంతకుముందు ‘విక్కీ డోనర్, పీకు, అక్టోబర్‌’ చిత్రాలకు కో–రైటర్‌గా పనిచేశారాయన. ఇంద్రకుమార్‌ దర్శకత్వంలో అజయ్‌ దేవగన్‌ ఓ హీరోగా నటించిన ధమాల్‌ ప్రాంచైజీలో మూడో భాగం ‘టోటల్‌ ధమాల్‌’ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top