ఐష్‌ ఫస్ట్‌ లేడీ

Aishwarya Rai Bachchan Receives First Ladies Award In Delhi - Sakshi

మాజీ ప్రపంచ సుందరి, కథానాయిక ఐశ్వర్యారాయ్‌ ‘ఫస్ట్‌ లేడీ’ పురస్కారం అందుకున్నారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలకు ఏటా ఈ అవార్డులు ఇస్తుంటారు. ఇందులో భాగంగా ఇరవై ఏళ్లుగా ఐశ్వర్యారాయ్‌  సినీరంగానికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రకటించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ‘ఫస్ట్‌ లేడీ’ అవార్డును ఐశ్వర్యకి అందజేశారు.

2002 నుంచి ప్రతి ఏటా కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటున్న ఐశ్వర్య ఇటీవల జ్యూరీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ‘కేన్స్‌’ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైన తొలి భారతీయ నటి ఐష్‌ కావడంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ ఆమెను ఘనంగా సత్కరించారు. కాగా, చిన్న వయసులోనే పైలెట్‌ అయిన ఆయేషా అజీజ్, కశ్మీర్‌కి చెందిన తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిణి రువేదా సలామ్‌లతో పాటు మరో 113 మందికి ‘ఫస్ట్‌ లేడీ’ పురస్కారాలు అందించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top