
కేన్స్ లో తళుక్కుమన్న ఐష్
బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ 68వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో తళుక్కుముంది.
కేన్స్: బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ 68వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో తళుక్కుముంది. నాలుగు పదుల వయసులో తన అందం ఇసుమంతైనా తగ్గలేదని నిరూపించింది. పచ్చరాయి రంగులో పొడుగు గౌను ధరించి రెడ్ కార్పెట్ పై హొయలు చిలికించిన ఐష్ ను తమ కెమెరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు పోటీపడ్డారు. ఆటోగ్రాఫుల కోసం అభిమానులు పోటీపడ్డారు.
స్లీవ్ లెస్ నెట్ డ్రెస్ ధరించి, కర్లీ కురులను లూజుగా వదిలి తక్కువ మేకప్ తో సహజ సౌందర్యం ఉట్టిపడేలా రెడ్ కార్పెట్ పై నడిచివచ్చిన ఐష్ ను చూసేందుకు రెండు కళ్లు చాలలేదు. తన మూడేళ్ల కూతురు ఆరాధ్యతో కలిసి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వచ్చిన ఐశ్వర్యరాయ్ తన తాజా చిత్రం 'జాజ్ బా' ఫస్ట్ లుక్ విడుదల చేయనుంది.