పుల్వామా ఘటన.. పాక్‌ నటులపై బ్యాన్‌

AICWA Banned Pakisthan Actors From Cine Industry - Sakshi

పుల్వామా ఘటనలో మన జవాన్లు వీర మరణం పొందడం దేశాన్ని కుదిపేసింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ ఘటనను ఖండించారు. వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు దేశ మొత్తం తోడుగా నిలిచింది. అయితే ఈ ఉగ్రదాడికి నిరసనగా ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే పాకిస్తాన్‌కు చెందిన నటీనటులను బ్యాన్‌ చేసింది. తమ సినిమాల్లో పాక్‌ నటీనటులను తీసుకోడానికి వీల్లేదంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌ తన ‘టొటల్‌ ధమాల్‌’ను పాకిస్థాన్‌లో విడుదల చేయడం లేదంటూ ప్రకటించారు. అంతేకాకుండా చిత్రయూనిట్‌ తరుపున అమరులైన సైనిక కుటుంబాలకు రూ.50లక్షల విరాళాన్ని ప్రకటించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top