ప్రేమలేఖను అమ్మకు ఇచ్చా!

Aditi Rao Hydari Talk About Her First Love Letter - Sakshi

చెన్నై: నాకు వచ్చిన మొదటి ప్రేమలేఖను అమ్మకు ఇచ్చాను అని చెప్తోంది హీరోయిన్‌ అదితిరావ్ హైదరి. మణిరత్నం తెరకెక్కించిన  కాట్రువెలియిడై చిత్రంలో కార్తీకు జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మడు  హైదరాబాద్‌ బ్యూటీ. ఈ మధ్య తెలుగులో సమ్మోహనం చిత్రంలో నటించి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్‌ అంటూ చుట్టేస్తున్న అదితిరావ్‌ ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా సైకో చిత్రంలో నటిస్తోంది. మిష్కిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది.

ఇటీవల ఈ బ్యూటీ తన ప్రేమ వ్యవహారం గురించి ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను 5వ తరగతి చదువుతున్నప్పుడే తన సీనియర్‌ ప్రేమలేఖను రాశాడని చెప్పింది. అప్పుడు తన వయసు 9 ఏళ్లు అని పేర్కొంది. ప్రేమ అంటే ఏమిటో తెలియని వయసులో అతను రాసిన రెండు పేజీల ప్రేమలేఖను తీసుకెళ్లి గర్వంగా తన తల్లికి ఇచ్చానని చెప్పింది. అంతే వేగంతో తనను బోర్డింగ్‌ స్కూల్‌లో చేర్పించారని తెలిపింది. ఇంతకీ ఆ లేఖలో అతను రాసిందేమిటంటే నువ్వు చాలా అందంగా ఉన్నాను.. లాంటి ఏవేవో రాతలు రాశాడని చెప్పింది. తనకు 21 ఏళ్ల వయసులో పెళ్లి జరిగిందని, ఎలా డేటింగ్‌ చేయాలో కూడా తెలియలేదని చెప్పుకొచ్చింది. ఆ తరువాత చిత్రాల్లో నటిస్తూ బిజీ అయిపోయాను అని నటి అదితిరావ్‌ పేర్కొంది. గ్లామర్‌ విషయంలో పరిమితులు లేవనే విధంగా నటించడానికి  రెడీ అనే అదితిరావ్‌ కారణాలేమైనా ఎక్కువ చిత్రాల్లో చిత్రాల్లో కనిపించడం లేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top