బంగారుగుడిలో త్రిష | Actress trisha in golden temple | Sakshi
Sakshi News home page

బంగారుగుడిలో త్రిష

Dec 14 2013 10:40 AM | Updated on Sep 2 2017 1:36 AM

బంగారుగుడిలో త్రిష

బంగారుగుడిలో త్రిష

వేలూరు శ్రీపురం బంగారుగుడిని సినీనటి త్రిష కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు.

వేలూరు శ్రీపురం బంగారుగుడిని సినీనటి త్రిష కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీపురం చేరుకున్న నటి త్రిషకు బంగారుగుడి మేనేజర్ సంపత్, నారాయణి పీఠం డెరైక్టర్ బాలాజీ, నిర్వాహకులు  స్వాగతం పలికారు. ఆమెకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక దర్శనం చేయించారు. కుటుంబ సభ్యులతో కలసి త్రిష పీఠంలోని నారాయణి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

 

అనంతరం పీఠంలో కొత్తగా 70 కిలోల బంగారంతో తయారు చేసిన శ్రీ స్వర్ణలక్ష్మి విగ్రహానికి త్రిష చేతుల మీదుగా ప్రత్యేక అభిషేకాలు చేయించారు. అనంతరం శ్రీనారాయణి పీఠాధిపతి శక్తిఅమ్మ వద్ద ఆశీర్వాదాలు పొంది ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.

 

సుమారు రెండు గంటల పాటు ఆలయంలో గడిపిన త్రిష, ఆమె కుటుంబ సభ్యులు అనంతరం చెన్నైకి బయలుదేరి వెళ్లారు. నటి త్రిష బంగారుగుడికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న భక్తులు, అభిమానులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement