హాస్య నటుడు కళ్లు చిదంబరం కన్నుమూత

హాస్య నటుడు కళ్లు చిదంబరం కన్నుమూత - Sakshi


విశాఖపట్నం: ప్రముఖ హాస్య నటుడు కళ్లు చిదంబరం (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు.కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం. 1945 అక్టోబర్ 10న విశాఖపట్నంలో జన్మించారు. ఆయన 'కళ్లు' చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేశారు. తన మొదటి సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకుని కళ్లు చిదంబరంగా గుర్తింపు పొందారు. ఆయన 300లకు పైగా సినిమాల్లో నటించారు. కళ్లు, అమ్మోరు, చంటి, మనీ, పెళ్లిపెందిరి, పవిత్రబంధం, ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, గోవిందా గోవిందా, అనగనగా ఒకరోజు తదితర చిత్రాల్లో నటించారు. ప్రత్యేకమైన పాత్రలు పోషించి గుర్తింపు పొందారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top