అభిమాని కోరిక తీర్చిన అమీర్ | aamir khan makes fan with progerias dream come true | Sakshi
Sakshi News home page

అభిమాని కోరిక తీర్చిన అమీర్

Dec 23 2015 11:28 AM | Updated on Sep 3 2017 2:27 PM

అభిమాని కోరిక తీర్చిన అమీర్

అభిమాని కోరిక తీర్చిన అమీర్

ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న అభిమానులను సంతోష పెట్టడంలో సినీతారలు ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ లిస్ట్లో సౌత్ హీరోలు మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్లు కూడా తమ పెద్ద మనసును...

ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న అభిమానులను సంతోష పెట్టడంలో సినీతారలు ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ లిస్ట్లో సౌత్ హీరోలు మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్లు కూడా తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రోజెరియాతో బాధపడుతున్న అభిమాని నిహాల్ బిట్లాను కలుసుకున్నాడు. తన లైఫ్పై అమీర్ ఖాన్ సినిమాల ప్రభావం గురించి అమీర్కు వివరించాడు నిహాల్.

తాను జీవితం పట్ల ఎంతో ఆశావాదంతో ఉన్నట్లుగా చెప్పాడు నిహాల్.  ఇలాంటి ఆలోచన విధానానికి రావడానికి కారణం అమీర్ నటించిన తారే జమీన్ పర్ సినిమానే అని వివరించాడు. అంతేకాదు దేశంలో తనలాగే తీవ్రఅనారోగ్యంతో బాధపడుతున్న 60 మంది ప్రొజేరియా ఎఫెక్టెడ్ పిల్లలకు సరైన వైధ్యం అందే విధంగా కృషి చేయాలని కోరాడు. తన ఫేస్ బుక్ పోస్ట్ చూసి ఇంత త్వరగా తనను కలవడానికి వచ్చిన అమీర్ ఖాన్కు కృతజ్ఞతలు తెలియజేశాడు.

పికె సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన అమీర్, ప్రస్తుతం రెజలర్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న దంగల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు పిల్లల తండ్రిగా నటిస్తున్న అమీర్ అందుకు తగ్గట్టుగా కనిపించేదుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2016 డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement