ప్రేమలో పడిపోయాడే... | Aadi’s new film Pyar mein Padipoyane shooting started | Sakshi
Sakshi News home page

ప్రేమలో పడిపోయాడే...

Nov 25 2013 1:00 AM | Updated on Sep 2 2017 12:57 AM

ప్రేమలో పడిపోయాడే...

ప్రేమలో పడిపోయాడే...

సామాన్యుడు, శ్రీమన్నారాయణ తదితర చిత్రాల దర్శకుడు రవి చావలి దర్శకత్వంలో ‘లవ్‌లీ’ పెయిర్ ఆది, శాన్వి నటిస్తున్న చిత్రం ‘ప్యార్ మే పడిపోయానె’. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న

 సామాన్యుడు, శ్రీమన్నారాయణ తదితర చిత్రాల దర్శకుడు రవి చావలి దర్శకత్వంలో ‘లవ్‌లీ’ పెయిర్ ఆది, శాన్వి నటిస్తున్న చిత్రం ‘ప్యార్ మే పడిపోయానె’. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మా సంస్థ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. రవి చావలి చెప్పిన కథ అద్భుతంగా ఉండటంతో చిత్రాన్ని స్టార్ట్ చేశాం. ‘లవ్‌లీ’ తర్వాత ఆది, శాన్వి కలిసి నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. హీరోగా తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని, ప్రస్తుతం జరుగుతున్న తొలి షెడ్యూల్ డిసెంబర్ 8 వరకూ జరుగుతుందని ఆది తెలిపారు. ఆదితో మళ్లీ కలిసి నటించడం పట్ల శాన్వి ఆనందం వ్యక్తం చేశారు. అలీ, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి, కళ: కె.వి.రమణ, కార్యనిర్వాహక నిర్మాత: ఎం.ఎస్.కుమార్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement