ఆన్లైన్లో లోకనాయకుడి హవా | 30,000 'follow' Kamal Haasan within 24 hours on Twitter | Sakshi
Sakshi News home page

ఆన్లైన్లో లోకనాయకుడి హవా

Jan 27 2016 12:13 PM | Updated on Sep 3 2017 4:25 PM

ఆన్లైన్లో లోకనాయకుడి హవా

ఆన్లైన్లో లోకనాయకుడి హవా

తెలుగు, తమిళ్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటుడు కమల్ హాసన్. ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన ఈ మహానటుడు సాంకేతికంగా కూడా...

తెలుగు, తమిళ్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటుడు కమల్ హాసన్. ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన ఈ మహానటుడు సాంకేతికంగా కూడా ముందే ఉన్నాడు. తన ఆలోచనలు, సినిమాలతో ప్రపంచీకరణతో పోటి పడే కమల్ హాసన్ తాజాగా ఆన్లైన్లో సత్తాచాటుతున్నాడు. ఇప్పటి వరకు ఫేస్ బుక్లో అభిమానులకు అందుబాటులో ఉన్న కమల్ తాజాగా ట్విట్టర్లోనూ జాయిన్ అయ్యాడు.

67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్విట్టర్లో జాయిన్ అయిన కమల్, ఇళయరాజా స్వరపరిచిన జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న వీడియోను తొలిసారిగా పోస్ట్ చేశాడు. భారత స్వాతంత్ర్య సమరాన్ని కీర్తిస్తూ తొలి కామెంట్ను పోస్ట్ చేసిన కమల్కు ఆయన కూతురు శృతిహాసన్ స్వాగతం పలికింది. అంతేకాదు కమల్ ట్విట్టర్లో జాయిన్ అయి 24 గంటలు కూడా గడవక ముందే ఆయన్ను 30 వేల మందికి పైగా ఫాలో అవ్వటం కమల్కు ఉన్న ఫాలోయింగ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement