ఏప్రిల్‌లో పరుచూరి రఘుబాబు నాటకోత్సవాలు

ఏప్రిల్‌లో పరుచూరి రఘుబాబు నాటకోత్సవాలు

వెండితెరకు రంగస్థలం అందించిన ప్రతిభామూర్తుల గురించి చెప్పుకుంటే... వారిలో పరుచూరి సోదరులు తప్పకుండా ఉంటారు. రంగస్థలంపై ఇప్పటికీ పరుచూరివారికి మమకారం తగ్గలేదు. అందుకే... రెండు దశాబ్దాలుగా పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు స్వర్గీయ పరుచూరి రఘుబాబు పేరిట నాటకోత్సవాలను నిర్వహిస్తూనే ఉన్నారు. పరుచూరి రఘుబాబు 24వ అఖిలభారత నాటకోత్సవాలను ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకూ గుంటూరు జిల్లా పల్లెకోన గ్రామంలోని నందమూరి తారకరామారావు కళాప్రాంగణంలో ఘనంగా నిర్వహించనున్నారు పరుచూరి బ్రదర్స్. ఈ నాటక పరిషత్‌లో పోటీ చేయాలనుకుంటున్న నాటక సమాజాల వారు తమ పూర్తి వివరాలను అందించాల్సిందిగా శనివారం వారు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.

 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top