అవగాహన కల్పిస్తున్న పేట లేబర్ ఆఫీసర్(ఫైల్)
సాక్షి, మరికల్: ‘ఎవరో వస్తారు.. ఏమో సాయం చేస్తారని.. ఎదురుచూసి మోసపోకు మిత్రమా..’ అని మోసపోకముందే ప్రధానమంత్రి అసంఘటిత కార్మికులకు చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘శ్రమ యోగి మాన్‌ధన్ పథకంలో చేరి పింఛన్ అవకాశం దక్కించుకొండి..’ అని ప్రచారం సాగిస్తున్నారు. అసంఘటిత కార్మికులకు ఈ పథకం ఓ వరంలా ఉపయోగపడుతుంది. 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నవారందరూ పీఎం శ్రమయోగి మాన్‌ధన్ పథకంలో చేరాలని ఆహ్వానిస్తుంది.
జీవితాంతం పింఛన్..
ఉద్యోగుల మాదిరి అసంఘిటిత రంగాల్లోని కార్మికులు నెలనెలా పింఛన్‌ను పొందనున్నారు. రెక్కాడితే డొక్కాడని కార్మికులు వయసుమీపడితే నిశ్చితంగా శేషజీవితం గడపనున్నారు. ఆరుపదుల వయస్సులో ఆర్థిక ఇబ్బందులను అదిగమించనున్నారు. తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ పథకం ద్వారా వేలాది మంది కార్మికులు కల సాకారం కొబోతుంది.
18 నుంచి 40 ఏళ్లు ఉన్నవారు అర్హులు..
ఈ పథకంలో చేరే వారు 18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉండాలి. వయస్సును బట్టి నెల, నెలకు తమపేర్ల మీద డబ్బులు కడితే అంతే మొత్తం కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఈ పథకంలో చేరిన వారికి 60 సంవత్సరాల వయస్సు రాగానే నెలకు రూ.3వేల చొప్పున పింఛన్ సౌకర్యం కల్పిస్తుంది. మిగితా అన్ని పింఛన్ పథకలతో పాటు అదనంగా పీఎం శ్రమయోగి మాన్‌ధన్ పింఛన్ వస్తుంది. ఒక వేళ లబ్ధిదారుడు మృతి చెందితే నామినీకి పింఛన్ వర్తిస్తుంది.
అసంఘిటిత కార్మికులకు వరం
దేశ ప్రధాని నరేంద్రమోదీ అమలు చేసిన ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పథకం ఆ సంఘటిత కార్మికులకు వరం లాంటింది. ఇందులో భవన నిర్మాణ, హమాలీ, రిక్షా, వ్యవసాయ కూలీలు, ఇళ్లలో పనిచేసే వారు, టీస్టాల్, తదితర చిన్న, చిన్న వ్యాపారులు సైతం ఈ పథకంలో చేరాడానికి అర్హులు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉన్న వారందరూ ఈ పథకంలో చేరి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కిస్తులు కడితే 60వ ఏట నుంచి ప్రతి నెలకు రూ.3వేలు పింఛన్ సౌకర్యం ఉంటుంది.
ఎక్కడ దరఖాస్తు చేపసుకోవాలి
ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పథకంలో చేరే లబ్ధిదారుల దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రతి గ్రామంలో ఓ కమన్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 18నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న వారందరూ తమ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, ఫోన్ నంబర్‌ను జతపర్చి ఇవ్వాల్సి ఉంటుంది.
ఏ వయస్సు వారికి ఎంత ప్రీమియం
| వయస్సు | లబ్ధిదారుడి వాటా |
కేంద్రం వాటా రూ.నెలకు |
మొత్తం రూ.లో రూ.నెలకు |
| 18 | 55 | 55 | 110 |
| 19 | 58 | 58 | 116 |
| 20 | 61 | 61 | 122 |
| 21 | 64 | 64 | 128 |
| 22 | 68 | 68 | 136 |
| 23 | 72 | 72 | 144 |
| 24 | 76 | 76 | 152 |
| 25 | 80 | 80 | 160 |
| 26 | 85 | 85 | 170 |
| 27 | 90 | 90 | 180 |
| 28 | 95 | 95 | 190 |
| 29 | 100 | 100 | 200 |
| 30 | 105 | 105 | 210 |
| 31 | 110 | 110 | 220 |
| 32 | 120 | 120 | 240 |
| 33 | 130 | 130 | 260 |
| 34 | 140 | 140 | 280 |
| 35 | 150 | 150 | 300 |
| 36 | 160 | 160 | 320 |
| 37 | 170 | 170 | 340 |
| 38 | 180 | 180 | 360 |
| 39 | 190 | 190 | 380 |
| 40 | 200 | 200 | 400 |
అవగాహన కల్పించాలి
అసంఘటిత కార్మికుల కోసం పీఎం శ్రమ్ యోగి మాన్‌ధన్ పథకం అమలు చేసిన కేంద్ర ప్రభుత్వ పథకంపై అధికారులు పూర్తి స్థాయిలో కార్మికులకు అవగాహన కల్పించి ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులను చేర్పించాలి. అన్ని రంగాల్లో పని చేసే కార్మికులతో పాటు వ్యవసాయ కూలీలకు ఈ పథకంలో చేరితే 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3వేల పింఛన్ ఇవ్వనుంది. అధిక శాతం కార్మికులను చేర్పించేందుకు కృషి చేస్తాం.

– రమేష్, భవన నిర్మాణ కార్మికుడు, మరికల్
పింఛన్‌కు దరఖాస్తు చేసుకోండి
అసంఘటిత కార్మికులకు వృద్ధ్యాప్యంలో ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రమయోగి మాన్‌ధన్ పథకం అమలు చేసింది. ఇందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు, వ్యవసాయ కూలీలకు అవగాహన కల్పిస్తున్నాం. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కమన్ సర్వీస్ సెంటర్‌లో దరఖాస్తు చేసుకుంటే 18 నుంచి 40 ఏళ్ల వయస్సు వారు నెలకు ఎంతో డబ్బులు కడితే అంతే మొత్తం కేంద్రం ప్రభుత్వం లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనున్నారు. 60 ఏళ్ల అనంతరం నెలకు రూ.3వేల పింఛన్ వరిస్తుంది. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలి.
– రాజ్‌కుమార్, జిల్లా లెబర్ ఆఫీసర్, నారాయణపేట


