నిమిషం కూడా ఆలోచించకుండా చచ్చిపొమ్మంది | A Vizag Boy Failure Love Story | Sakshi
Sakshi News home page

నిమిషం కూడా ఆలోచించకుండా చచ్చిపొమ్మంది

Jan 7 2020 1:22 PM | Updated on Jan 8 2020 1:39 PM

A Vizag Boy Failure Love Story  - Sakshi

నా పేరు ఉదయ్. మాది విశాఖపట్నం. నేను నాలుగు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని లవ్ చేశాను. తనకి నేను ప్రపోజ్‌  చేసిన తరువాత  ఒక సంవత్సరానికి తను నాకు ఓకే చెప్పింది. అందరి లవర్స్‌ లాగానే మేము కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఒకరోజు మా విషయం వాళ్ల ఇంట్లో తెలిసింది. వెంటనే తను నాకు ఫోన్ చేయడం మానేసింది. కానీ నేను ప్రతి రోజూ తన ఫోన్ కోసం ఎదురు చూసేవాడ్ని.

ఒక రోజు తన దగ్గర నుంచి  ఫోన్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ తను నాకు ఫోన్ చేసి నన్ను మర్చిపో అంది. నాకు చాలా బాధ అనిపించింది తాను లేని జీవితం వృధా అనుకున్నా. తనకి ఫోన్ చేశాను నువ్వు లేని జీవితం భరించటం నా వల్ల కాదు నేను చనిపోతా అని చెప్పాను కానీ తను కనీసం ఆలోచించకుండా చనిపో అంది. అప్పుడు చాలా ఏడ్చాను. ఎలాంటి అమ్మాయిని కూడా ఇంకా నా జీవితం లోకి రానివ్వకూడదు అని నిర్ణయించుకన్నాను. తాను 2019లో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది కానీ నేను తన గురించే తలచుకుంటూ బతుకుతున్నాను.  తాను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను.

-ఉదయ్‌(విశాఖపట్నం)

Advertisement
 
Advertisement
Advertisement