ప్రేమించిన అమ్మాయిని కన్‌ఫ్యూజ్‌ చేస్తే?!.. | Remo Love Movie Review | Sakshi
Sakshi News home page

ప్రియురాలి కోసం నర్సు గెటప్‌!

Dec 14 2019 11:44 AM | Updated on Dec 14 2019 11:50 AM

Remo Love Movie Review - Sakshi

రెమో 

సినిమా : రెమో 
తారాగణం : శివ కార్తికేయన్‌, కీర్తి సురేష్‌, శరణ్య, సతీష్‌, కేఎస్‌ రవికుమార్‌, యోగి బాబు, రాజేంద్రన్‌

కథ : శివ ‌(శివకార్తికేయన్‌) ఓ ఔత్సాహిక నటుడు. ఎప్పటికైనా రజినీకాంత్‌లా ఓ గొప్ప సూపర్‌స్టార్‌ అవ్వాలనేది అతడి ఆశయం. ఓ సారి కేఎస్‌ రవికుమార్‌ తీయబోతున్న కొత్త సినిమా ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి వెళతాడు. అయితే ప్రేమకు సంబంధించిన సీన్లు నటించటంలో అతడు ఫేయిలవుతాడు. ఆ సమయంలోనే డాక్టర్‌ కావ్య(కీర్తి సురేష్‌) ప్రేమలో పడతాడు. కొద్దిరోజుల తర్వాత ప్రపోజ్‌ చేయటానికి కావ్య ఇంటికి వెళతాడు. ఆమెకు ఎంగేజ్‌మెంట్‌ జరుగుతుండటంతో బాధతో వెనక్కు తిరిగివస్తాడు. ఆ తర్వాత నర్సు గెటప్‌లో కేఎస్‌ రవికుమార్‌ దగ్గరకు వెళతాడు. అప్పుడు కూడా ఆడిషన్‌ ఫేయిల్‌ అవుతుంది.

రెమో చిత్రంలోని ఓ దృశ్యం
ఆ బాధలో ఉన్నపుడే నర్సు రెమో(రెజీనా మోత్వానీ)గా కావ్యకు పరిచయం అవుతాడు. రెమోకు తను పనిచేసే ఆసుపత్రిలోనే కావ్య ఉద్యోగం ఇప్పిస్తుంది. కావ్యను మళ్లీ తన జీవితంలోకి పంపటం దేవుడిచ్చిన రెండో అవకాశంగా భావించిన శివ! ఆమెను ఎలాగైనా కన్‌ఫ్యూజ్‌ చేసి తన ప్రేమలో పడేయ్యాలనుకుంటాడు. ఆమె వెంటే ఉంటూ ఆమెను నిత్యం కన్‌ఫ్యూజ్‌ చేస్తుంటాడు. అయితే రెమో వేషంలో ఉన్న శివ, కావ్యను కన్‌ఫ్యూజ్‌ చేసి తనను ప్రేమించేలా చేసుకుంటాడా? అప్పటికే ఎంగేజ్‌మెంట్‌ అయిన కావ్య, శివ ప్రేమలో పడుతుందా? ఎంగేజ్‌మెంట్‌ కాదనుకుని శివకు ఓకే చెబుతుందా? లేదా? అన్నదే మిగితా కథ. 

రెమో చిత్రంలోని ఓ దృశ్యం
విశ్లేషణ : 2016లో విడుదలైన రెమో ఫుల్‌లెన్త్‌ రొమాంటిక్‌ కామెడీ సినిమా. రజినీ మురగన్‌ సినిమాతో లవర్స్‌గా ప్రేక్షకులను మెప్పించిన శివకార్తికేయన్‌, కీర్తి సురేష్‌ల జోడీ మరో సారి ఆకట్టుకుంది. లవ్‌ సీన్స్‌లో ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగుంటుంది. ప్రియురాలిని దక్కించుకోవటానికి అమ్మాయి గెటప్‌లో హీరో పడే కష్టాలు మనల్ని బాగా నవ్విస్తాయి. సినిమా ఎక్కడా బోరు కొట్టకుండా ఆద్యాంతం అలరిస్తూ సాగిపోతుంది.

లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement