అమ్మలేదు... ఆ అమ్మాయి కూడా రాదు! | Nellore Boy Shiva Failure Love Story | Sakshi
Sakshi News home page

ఎలా ఉంటే మీకు నచ్చుతాను చెప్పండి!

Jan 26 2020 1:13 PM | Updated on Jan 26 2020 5:42 PM

Nellore Boy Shiva Failure Love Story - Sakshi

నాకు అమ్మలేదు. మా అమ్మ పేరు ఉష. నేను ప్రేమించిన అమ్మాయి పేరు కూడా ఉషనే. అమ్మ ఇప్పుడు నాతో లేదు. ఆ అమ్మాయి కూడా నాతో ఉండదేమో అనిపిస్తుంది. తను మా అత్తమ్మ వాళ్ల అమ్మాయి. నేను ఆమెకు ప్రపోజ్‌ చేసి రెండు సంవత్సరాల పైనే అయ్యింది. ఆమె నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. వస్తుంది అనే నమ్మకం కూడా లేదు. నాకు ఉష కావాలి. ఉష లేకపోతే చచ్చిపోతాను అని చెప్పాను కానీ నా బాధ మాత్రం దానికి సమానమైనదే. తనకి నా ప్రేమ ఎందుకు అర్థం కావడంలేదో. బహుశా నాకు ఉద్యోగం లేదు. అంత అందంగానూ ఉండను. కానీ తను అలా అనుకునే అమ్మాయి కాదు. అందుకే ఆమెను ప్రేమించాను.

జాబ్‌ లేకపోయిన నేను రైతును అన్నింటికి మించి తనని చాలా ప్రేమిస్తున్నాను. ఇది చాలదా ఆమె నన్ను ప్రేమించడానికి? నీకు నచ్చడానికి ఏమైనా చేయాలా చెప్పండి ఉషగారు. అలాగే ఉంటాను. అంతేగాని నాకు మాత్రం దూరంగా ఉండకండి. ఏడుపొస్తోంది. నీ కోసం ఎన్ని రోజులైన ఎదురుచూస్తూ ఉంటాను. నువ్వు ఒప్పుకునే వరకు ఉంటాను. లేదా మీరు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పండి. నిజంగా మిమ్మల్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. ఐ లవ్‌ యూ మేడమ్‌. నాకు ఈ ప్రపంచంలో ఉండాలి అనిపించడం లేదు. బాధపడుతూ అయిన ఉంటాను. మిస్‌ యూ ఉషగారు. 

శివ (నెల్లూరు).

Advertisement
 
Advertisement
Advertisement