నా కడుపున పుడతానన్నాడు! | Kama Reddy Girl Akshara Sad Ending Love Story | Sakshi
Sakshi News home page

నీ కోసమైనా పెళ్లి చేసుకుంటాను!

Jan 17 2020 7:16 PM | Updated on Jan 17 2020 7:45 PM

Kama Reddy Girl Akshara Sad Ending Love Story - Sakshi

 వేసవి సెలవులు కావడంతో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను . అక్కడ నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు తన పేరు ఉష కుమార్ . తను నన్నురోజూ చూసేవాడు అని నాకు మా అక్క చెప్పేది.  ఒక రోజు తను నా దగ్గరకి వచ్చి నీ పేరు ఏంటి అని అడిగాడు భయమేసి నేను చెప్పలేదు.  కానీ వన్డేలోనే నా పేరు నా వివరాలు అన్ని తెలుసుకున్నాడు.నేను బయటకి ఎక్కడికి వెళ్లిన నా వెనుక ఫాలో  అయ్యేవాడు.  కొన్ని రోజులకి నాకు ప్రపోజ్‌ చేశాడు. కానీ  నేను ఏమీ చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోయా. నాకు డైలీ  లవ్ యూ అని మెసేజ్ చేసేవాడు.  నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పేవాడు. తన బిహేవియర్ నచ్చి నేను ఓకే చేశా. చాలా తొందరగా సమ్మర్ హాలిడేస్ గడచిపోయాయి. నేను హైదరాబాద్ కి వెళ్ళిపోయాను. రోజూ  కాల్స్,  మెసేజ్‌లు  చేసుకునేవాళ్ళం. 

తరువాత కొన్ని రోజులకి మా ప్రేమకు చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. తను నాతో సరిగా మాట్లాడకపోయేవాడు.  కాల్ చేస్తే కట్ చేసేవాడు. మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం మానేశాడు.  నాకు ఏమి చేయాలో అర్థం కాక చాలా ఏడ్చాను. ఇంకా అలా కాదు అని మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్లి తనను మీట్ అయ్యాను. నన్ను చూడగానే తన కళ్ళలో ఏదో తెలియని బాధ.  నన్ను వచ్చి ఒకసారి హగ్ చేసుకొని చాలా  ఏడ్చాడు.  ఏమైంది అంటే ఏం చెప్పలేదు. కొంచెంసేపటి తరువాత ఎందుకు వచ్చావు వెళ్లు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని పంపించేశాడు. తరువాత కొంతకాలానికి నేను వాళ్ల సిస్టర్‌కు కాల్‌ చేశాను. అసలు ఏమైందో చెప్పమని అడిగాను. 

అప్పుడు తను వదిన మా అన్నయ్యను మర్చిపో, అన్నయ్యకు బ్లడ్‌ క్యాన్సర్‌ అంది. ఆ మాటతో నా గుండె పగిలిపోయింది. చాలా ఏడ్చాను. తను నన్ను మర్చిపోయి నువ్వు హ్యాపీగా ఉండు, నిన్ను పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా చూసుకుందాం అనుకున్నాను. కానీ ఆ దేవుడు నాకు అంత అదృష్టాన్ని ఇవ్వలేదు. నేను ఇంకా ఎన్నో రోజులు బతకను, నన్ను మరచిపోయి నువ్వు వేరే పెళ్లి చేసుకొని హాయిగా ఉండు అని చెప్పాడు. కొన్ని రోజులకు అతను చనిపోయాడు. ఇప్పటికీ వాళ్ల ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. తన జ్ఞాపకాలు తనని మర్చిపోలేకుండా చేస్తున్నాయి. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేనే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యపీగా ఉండాలని తను కోరుకున్నాడు. నా కడుపున బేబీగా పుడతాను అని చెప్పాడు. లవ్‌ యూ బంగారం, తొందరగా రా ఓకే నా!

అక్షర ( కామా రెడ్డి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement