కాలేజ్‌లో చేరాక తను మారిపోయింది! | Hyderabad Boy Harsha Failure Love Story. | Sakshi
Sakshi News home page

ఆ విషయం తెలిసి షాక్‌ అయ్యాను!

Jan 24 2020 12:57 PM | Updated on Jan 24 2020 1:01 PM

Hyderabad Boy Harsha Failure Love Story. - Sakshi

 నా పేరు హర్ష(పేరు మార్చాం). నా జీవితంలో ఒక మంచి లవ్‌ స్టోరీ ఉంది. నేను ప్రేమించిన అమ్మాయి పేరు సుధారాణి. తనంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయిని మొదటిసారి చూసినప్పుడే బాగా నచ్చింది. ఐ లవ్‌ యూ చెప్పాలనిపించింది. వాళ్ల ఇళ్లు మా రూమ్‌ పక్కనే ఉండేది. తనకి ఐ లవ్‌ యూ అనే మూడు ముక్కలు చెప్పడానికి నాకు మూడు నెలలు పట్టింది. అది కూడా నేను చెప్పలేదు. మా చెల్లితో నా ప్రేమ విషయం తనకి చెప్పించాను. తను ఒప్పుకుంది. తరువాత మేం చాలా హ్యాపీగా ఉన్నాం. అలా రెండు సంవత్సరాలు గడిచాయి.

తరువాత తను బీటెక్‌ చదవడానికి కాలేజీలో చేరింది. అప్పటి నుంచి తను పూర్తిగా మారిపోయింది. నన్ను చెడ్డగా అనుకోవడం మొదలుపెట్టింది. అయినా నేను తనని బతిమిలాడాను. తరువాత కూడా మేం రెండు సంవత్సారాలు కలిసి ఉన్నాం. తరువాత ఒకరోజు నేనంటే తనకి ఇష్టం లేదని నన్ను ఫ్రెండ్‌గానే చూశాను అని చెప్పింది. అప్పుడు ప్రాణం పోయేంత బాధగా అనిపించింది. తరువాత నాకు ఆమెకు చాలా మంది బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నారని తెలిసి షాక​ అయ్యాను. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఎవ్వరూ కరెక్ట్‌గా లేరు( ఇది నా ఉద్దేశ్యం మాత్రమే). 

హర్ష( హైదరాబాద్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement