ఇలా చేస్తే ఏడు రకాల క్యాన్సర్లకు చెక్‌..

A Brisk Walk Could Reduce The Risk Of Seven Types Of Cancer - Sakshi

న్యూయార్క్‌ : వారానికి రెండున్నర గంటలు లేదా రోజుకు దాదాపు 20 నిమిషాలు పైగా వేగంగా నడిస్తే ఏడు రకాల క్యాన్సర్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. ఈ తరహా వ్యాయామంతో స్త్రీ, పురుషులు లివర్‌ క్యాన్సర్‌ ముప్పును 18 శాతం, మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ముప్పు 6 శాతం మేర తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. వారానికి ఏడు గంటల పాటు వేగంగా నడిస్తే ఈ ముప్పు 10 శాతం తగ్గుతుందని తేల్చారు. వారానికి రెండున్నర గంటల పాటు వేగంగా నడిస్తే కిడ్నీ క్యాన్సర్‌ ముప్పును 11 శాతం, ఐదుగంటల వ్యాయామంతో 17 శాతం మేర ఈ ముప్పును తగ్గించవచ్చని వెల్లడించారు. బ్రిస్క్‌ వాకింగ్‌ చేసే పురుషుల్లో జీర్ణవాహిక క్యాన్సర్‌ ముప్పు 14 శాతం మేర తగ్గినట్టు గుర్తించారు.

ఇక స్త్రీ, పురుషులిద్దరిలో బ్లడ్‌ క్యాన్సర్‌ ముప్పు 19 శాతం తగ్గినట్టు వెల్లడైంది. వ్యాయామంతో బరువు తగ్గడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని, చురుకైన వ్యక్తులు వ్యాయామం చేయడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్లను నియంత్రించుకోగలుగుతారని ఈ ఫలితాలు వెల్లడించాయని పరిశోధకులు తెలిపారు. 7.5 లక్షల మందిపై పదేళ్ల పాటు పరిశోధనలు చేపట్టిన అనంతరం ఈ అవగాహనకు వచ్చినట్టు అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీకి చెందిన సహ రచయిత డాక్టర్‌ అల్ఫా పటేల్‌ వెల్లడించారు. వేగంగా నడవటం వంటి సరళమైన వ్యాయామంతో పలు రకాల క్యాన్సర్ల ముప్పును నిరోధించవచ్చని పరిశోధనలో వెల్లడవడం నిజంగా అద్భుత ఫలితమేనని పరిశోధకులు విశ్లేషించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top