తన కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతున్నా

Breakup Stories : Srinivas Sad Ending Telugu Love Story - Sakshi

నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు ఒక ఫ్యామిలీ పరిచయం అయ్యింది. నేను డిగ్రీ పూర్తి అయ్యేసరికి నాకు ఆ ఫ్యామిలీకి, బాగా పరిచయం ఏర్పడింది. ఆ ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. మొదటి అమ్మాయి నా క్లాస్‌మేట్ అందరూ మా ఇద్దరి మధ్య స్నేహం చూసి మమ్మల్ని ప్రేమికులనుకునేవారు. ఆ అమ్మాయి ఒకసారి తన మనసులో ప్రేమను నాతో చెప్పింది. నేను ‘మన ఇద్దరి మధ్య స్నేహం ఉంది. ప్రేమ లేదు! నిన్ను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు’ అని చెప్పా. ఆ అమ్మాయి నా స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే హఠాత్తుగా మూడు సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి చెల్లెలు నాకు ఫోన్ చేసి ‘నువ్వంటే నాకు ఇష్టం! నీకు చెప్పాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. కానీ, చెప్పలేకపోయాను.’ అని చెప్పి కాల్ కట్ చేసింది. ఆ తర్వాత రెగ్యులర్‌గా నాకు కాల్ చేసేది.

నువ్వు లేకపోతే నేను బ్రతకలేను’ అంటూ మాట్లాడటం మొదలు పెట్టింది. అయినా నేను బయట పడలేదు. ఈ గోల ఎందుకని నేను హైదరాబాద్ వచ్చాను. ఆ అమ్మాయి నీతోనే ఉంట అని హైదరాబాద్ వచ్చి ఒక పత్రిక కార్యాలయంలో చేరింది. నాతోనే జీవితం పంచుకుంటా అని మాటలు చెప్పి.. గత ఫిబ్రవరిలో ‘నేను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’ అని నాకు ఒక మెసేజ్ పెట్టింది. నేను ఆమె కోసం ఎన్నో కలలు కన్నా. అవన్నీ ఆ క్షణం కళ్ల ముందు కనపడి కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. ఇలాగ కూడా జరుగుతుందా అనిపించింది నాకు. రోజు 5 గంటలు చాటింగ్ చేసే ఈ అమ్మాయి ఇలా ఎలా చేసిందనుకున్నా.

ఇంతలో వాళ్ల అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. ‘నువ్వు మా అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశావంట’ అని అడిగింది. వాళ్ల అమ్మకు అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశాను. ఆమె కొంత వరకు అర్థం చేసుకుని ‘మా అమ్మాయిని వదిలేయ్! నువ్వంటే మా అమ్మాయికి ఇష్టం లేదు’ అని చెప్పింది. నేను ఆ షాక్ నుండి కోలుకోలేకపోయా. వాళ్ల అమ్మ నా మీద చీటింగ్ కేస్ పెట్టమని ఒత్తిడి తీసుకుని వచ్చింది. కానీ వాళ్ల కుటుంబం ముందు జరిగిన విషయాలు మొత్తం బయటపెట్టా. నేను తప్పు చేస్తే కేస్ పెట్టమని చెప్పాను. వాళ్లు వాళ్ల అమ్మాయితో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేశారు. అమ్మాయి వినలేదు.

వాళ్లు ఆ అమ్మాయితో మాట్లాడటం మానేశారు. వాళ్ల ఇంటికి రావద్దని చెప్పారు. నీకు మాకు సంబంధం లేదు అని చెప్పారు. ఇవన్నీ జరిగి నెలలు అవుతున్నా నేను ఆమె ప్రేమ నుంచి బయపడలేక మందుకు బానిసయ్యా. తాగి తనను మరిచిపోదామనుకున్నా. నా స్నేహితుడు నన్ను వారించి అలా చెయ్యకు ఆరోగ్యం పాడైపోతుందని చెప్పాడు. ఆమె చూపించిన ప్రేమానుబంధాలనుంచి బయట పడలేకపోతున్నా. ఏ రోజు అయినా నా గురించి ఆలోచన చెయ్యక పోతుందా? మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, మా అనుభవాలు గుర్తుకు రాకపోతాయా? అని ఎదురు చూస్తూ బ్రతుకుతున్నా. ఆ అమ్మాయి అలా 10 సంవత్సరాల అనుబంధాన్ని చాలా ఈజీగా దూరం చేసుకోగలిగింది. అలా ఎలా చేయగలిగిందో నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. 
- శ్రీనివాస్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top