రాష్ట్రంలో ఐదు సబ్‌ జైళ్ల మూసివేత | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ఐదు సబ్‌ జైళ్ల మూసివేత

Published Sat, Jan 27 2018 3:34 AM

Closure of five sub jails in the state - Sakshi

ఆర్మూర్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఐదు సబ్‌ జైళ్లను తాత్కాలికంగా మూసి వేస్తున్నారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ జీవో నంబర్‌ 6158ని విడుదల చేశారు. నిర్వహణ భారం కారణంగా నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్, బోధన్‌ సబ్‌ జైళ్లతో పాటు వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట, పరకాల, ఖమ్మం జిల్లాలోని మదిర సబ్‌ జైళ్లను మూసి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమైక్య పాలకుల హయాంలోనే ఆర్మూర్‌ సబ్‌ జైలును మూసి వేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డప్పటికీ స్థానికులు, న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు ఆ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసారు.

ఆర్మూర్‌ సబ్‌ జైలులో పది మంది రిమాండ్‌ ఖైదీలను ఉంచడానికి సరిపడా సౌకర్యాలు ఉండగా, 20 నుంచి 25 మంది రిమాండ్‌ ఖైదీలను ఇక్కడ ఉంచడానికి అవకాశం ఉంది. కానీ, జైళ్ల శాఖకు నిర్వహణ భారం అధికం అవుతుండటంతో తాత్కాలికంగా సబ్‌ జైలును మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. 

Advertisement
Advertisement