
బీర్కూర్: పంచాయతీరాజ్ చట్ట సవరణ తరహాలోనే సహకార చట్టాన్ని సవరించిన తర్వాతే సహకార సంఘా లకు ఎన్నికలు నిర్వహిస్తామని వ్యవ సాయ, సహకార శాఖల మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని శ్రీవేంకటేశ్వరాలయంలో నిర్వహించిన గోదా దేవి–రంగనాథుల కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సహకార ఎన్నికల విషయమై ఇప్పటికే రెండు, మూడు సార్లు సమావేశమయ్యా మన్నారు.
పాలక వర్గాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు నాలుగు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ఎన్నికలు నిర్వహిం చడం, అఫీషియల్, నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జిలతోపాటు మరో ముగ్గురు అధికారులతో కమిటీ వేయడం, ప్రస్తుత పాలకవర్గాన్నే కొనసాగించే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.