బ్యాడ్‌ టైంలో..గుడ్‌ టైం అంటే ఇదే | Wrong Place Wrong Time: Crane Crushes Audi | Sakshi
Sakshi News home page

బ్యాడ్‌ టైంలో..గుడ్‌ టైం అంటే ఇదే

Oct 18 2017 1:11 PM | Updated on Apr 3 2019 7:53 PM

Wrong Place Wrong Time: Crane Crushes Audi - Sakshi

బీజింగ్: కన్నుమూసి తెరిచేలోపు  అనూహ‍్యంగా ఓ డ్రైవర్‌ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.  అద్భుతానికే  ఆశ్చర్యం వేసేలా ఉన్న ఈ మిరాకిల్‌  వీడియో  ఇపుడు నెట్‌లో వైరల్‌ గా మారింది.

డెయిలీ మెయిల్‌  రిపోర్ట్‌ ప్రకారం చైనాలో ఝుజాయ్ ప్రావిన్స్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఖరీదైన ఆడి కారుపై సడెన్‌గా ఓ భారీ క్రేన్ వచ్చి పడింది. దీంతో కారు ముందు భాగం  నుజ్జునుజ్జయింది.  అయితే   డ్రైవర్‌(29) మాత్రం స్వల్ప గాయాలతో  బయటకు రావడం వీడియోలో చూడొచ్చు.   

ఏం జరిగిందో తెలియక బిక్కుబిక్కుమంటూ పగిలిపోయిన అద్దం నుంచి డ్రైవర్ బయటకు రావడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.  డ్రైవర్ కాలి మడమ విరగడంతో అతన్ని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అకస్మాత్తుగా  ఘటన జరగడంతో అసలు ఏం జరిగిందో అర్థం కాలేదంటూ డ్రైవర్ బేల ముఖం పెట్టాడు.  మరోవైపుఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలు  పెట్టారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement