'కేక్‌ కల్చర్‌కి దూరంగా ఉండండి..' | Workplace cake culture may fuel obesity risk: experts | Sakshi
Sakshi News home page

'కేక్‌ కల్చర్‌కి దూరంగా ఉండండి..'

Jan 5 2017 8:16 PM | Updated on Sep 5 2017 12:30 AM

'కేక్‌ కల్చర్‌కి దూరంగా ఉండండి..'

'కేక్‌ కల్చర్‌కి దూరంగా ఉండండి..'

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. పాత రోజుల్లోకేవలం ఇంట్లో వండిన ఆహార పదార్థాలను మాత్రమే ఆరగించేవారు.

లండన్‌: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. పాత రోజుల్లోకేవలం ఇంట్లో వండిన ఆహార పదార్థాలను మాత్రమే ఆరగించేవారు. ప్రస్తుత పరిస్థితి పూర్తి విరుద్దంగా ఉంది. రోడ్ల మీద , మురికి కాల్వల పక్కన, బాగా కాచిన నూనెతో వండిన పదార్థాలను తిని రోగాల బారిన పడుతున్నారు.  ఆధునిక ప్రపంచంలో కేక్‌ కల్చర్‌కి మంచి డిమాండ్‌ పెరిగింది. 
 
చిన్న చిన్న ఫంక్షన్స్‌కి కేక్‌ కట్‌ చేయడం ఇటీవల ఫ్యాషనై పోయింది. ఈ ఫ్యాషన్‌ రంగం నుంచి బయట పడండని యుకె లోని డెంటల్‌ కాలేజ్‌ ప్రొపెసర్‌ నైగెల్‌ హంట్‌  తెలిపారు. కేకులు తినడం వల్ల అధిక బరువు పెరుగుతున్నారని, దీంతో ఒబెసిటీ సమస్య పొంచి ఉందని చెబుతున్నారు. ఈ తరం పిల్లల్ని పట్టి పీడిస్తున్న సమస్య ఒబెసిటీ. ముఖ్యంగా కేక్‌లు తినడం టీనేజ్‌ అమ్మాయిల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందన్నారు. 
 
పిల్లలు ఇష్టపడుతున్నారని స్నాక్స్‌ పేరుతో నూడిల్స్‌, పానీపూరి, బేకరీ ఐటమ్స్‌ అందిస్తుంటాం. ఇవి ఆరగించే సమయంలో నోటికి ఎంతో రుచికరంగా ఉన్నప్పటికీ... ఆ తర్వాత అనేక ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. జంక్‌పుడ్స్‌ తినడం వల్ల ఒబెసిటీ, దీర్ఘకాలిక వ్యాధులొస్తున్నాయని హంట్‌ హెచ్చరిస్తున్నారు. ఈ తరహా పుడ్‌ వల్ల రోగనిరోధకశక్తి తగ్గడానికి, అధిక బరువు పెరగడానికి, పొట్ట సైజు పెరగడానకి కారణాలని చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement