చిలకడదుంపతో కేక్‌, ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్‌ బావుంటుంది | Walnut Sweet Potato Cake Recipe In Telugu | Sakshi
Sakshi News home page

Walnut Sweet Potato Cake: చిలకడదుంపతో కేక్‌, ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్‌ బావుంటుంది

Oct 11 2023 12:46 PM | Updated on Oct 11 2023 12:57 PM

Walnut Sweet Potato Cake Recipe In Telugu - Sakshi

వాల్‌నట్‌ – స్వీట్‌పొటాటో కేక్‌ తయారీకి కావల్సినవి:

చిలగడదుంప›– 1(పెద్దది, సుమారు 450గ్రాములు ఉండాలి.)
వాల్‌నట్‌ – 100 గ్రాములు,పంచదార – 200 గ్రాములు
బ్రౌన్‌ షుగర్‌ – 50గ్రాములు, వెజిటబుల్‌ నూనె – 120 మిల్లీలీటర్లు
నీళ్లు – 80 మిల్లీలీటర్లు, గుడ్లు – 2, ఉప్పు – తగినంత
మైదాపిండి – 220 గ్రాములు, బేకింగ్‌ పౌడర్‌ – 1 టీ స్పూన్‌
దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్‌,జాజికాయ పొడి – పావు టీ స్పూన్‌


తయారీ విధానమిలా:
చిలగడ దుంపను సిల్వర్‌ పేపర్‌లో చుట్టి.. ఓవెన్‌లో బాగా బేక్‌ చేసుకుని.. చల్లారిన తర్వాత.. మెత్తగా చిదుముకోవాలి. అనంతరం ఒక బౌల్‌ తీసుకుని.. అందులో గుడ్లు, పంచదార, బ్రౌన్‌ షుగర్‌ వేసుకుని.. హ్యాండ్‌ బ్లెండర్‌తో మిక్స్‌ చేసుకోవాలి. తర్వాత నూనె, నీళ్లు పోసుకుని మరోసారి హ్యాండ్‌ బ్లెండర్‌తో బాగా కలుపుకోవాలి.

ఇంతలో మరో బౌల్‌ తీసుకుని.. అందులో మైదాపిండి, బేకింగ్‌ పౌడర్, దాల్చిన చెక్క పొడి, ఉప్పు, జాజికాయ పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్‌ మిశ్రమంలో మైదా మిశ్రమం కలిపి.. హ్యాండ్‌ బ్లెండర్‌తో మరోసారి కలపాలి.

దానిలో చిలగడదుంప గుజ్జుని వేసుకుని.. బాగా కలిపి.. నచ్చిన షేప్‌లోని బేకింగ్‌ బౌల్‌ తీసుకుని.. అందులో ఈ మిశ్రమం మొత్తం పోసుకుని.. సమాంతరంగా పరచి ఓవెన్‌లో బేక్‌ చేసుకోవాలి. అనంతరం చాక్లెట్‌ బిట్స్, క్రీమ్స్‌తో నచ్చిన విధంగా డెకరేట్‌ చేసుకోవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement