హంసరాశి గ్రహంపై నీటి ఆవిరి! | water vapours on another planet | Sakshi
Sakshi News home page

హంసరాశి గ్రహంపై నీటి ఆవిరి!

Sep 26 2014 2:21 AM | Updated on Sep 2 2017 1:57 PM

హంసరాశి గ్రహంపై నీటి ఆవిరి!

హంసరాశి గ్రహంపై నీటి ఆవిరి!

మనకు 120 కాంతి సంవత్సరాల దూరంలో.. హంస రాశిలోగల ఓ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహంపై కూడా నీటి ఆవిరి ఉందట. మామూలుగా ఇతర నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాలు మన భూమికన్నా చాలా పెద్దగా ఉంటాయి.

మనకు 120 కాంతి సంవత్సరాల దూరంలో.. హంస రాశిలోగల ఓ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహంపై కూడా నీటి ఆవిరి ఉందట. మామూలుగా ఇతర నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాలు మన భూమికన్నా చాలా పెద్దగా ఉంటాయి. వాటిని అధిగ్రహాలుగా పిలుస్తారు. అయితే హ్యాట్-పీ-11బీ అనే ఈ అధిగ్రహం.. నీటి ఆవిరితో ఉన్నట్లు కనుగొన్న అన్ని అధిగ్రహాల్లోకెల్లా అతి చిన్నదట.  
 
నెప్ట్యూన్ అంత సైజులో ఉన్న ‘హ్యాట్-పీ’ని నాసా/ఈసా హబుల్, స్పిట్జర్, కెప్లర్ టెలిస్కోపుల సాయంతో మధుసూదన్ అనే భారత సంతతి శాస్త్రవేత్తతో కూడిన అంతర్జాతీయ బృందం కనుగొంది. భూమిలాంటి గ్రహాలపై వాతావరణంలో నీటి అణువులను గుర్తించడంలో వీరి పరిశోధన ఒక మైలురాయి అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గ్రహం తన నక్షత్రానికి అతి సమీపం నుంచే చుట్టూ తిరుగుతోందట. నక్షత్రం ముందుగా వెళుతున్నప్పుడు నక్షత్ర కాంతి వర్ణపటంలో కనిపించే తేడాను బట్టి.. దీనిని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement