వెనెజులా అధ్యక్షుడిగా మళ్లీ మదురో

Venezuela President Maduro sworn in for second term - Sakshi

కారకస్‌: వెనెజులా అధ్యక్షుడిగా నికోలస్‌ మదురో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. దేశంలో పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ,  క్షీణిస్తున్న శాంతిభద్రతల నేపథ్యంలో అధికారం నుంచి దిగిపోవాలని అంతర్జాతీయ సమాజం సూచించినా పదవి చేపట్టడానికే ఆయన మొగ్గు చూపారు. రాజధాని కారకస్‌లో జరిగిన మదురో ప్రమాణస్వీకార కార్యక్రమానికి 94 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. మదురో బాధ్యతలు చేపట్టడాన్ని అమెరికా, కెనడా సహా డజను లాటిన్‌ అమెరికా దేశాలు వ్యతిరేకించాయి. ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల్లో నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లు మదురో మేలో ప్రకటించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top