ఫ్రీజర్ కొంటే.. డెడ్ బాడీ వచ్చింది | US woman buys second-hand freezer, finds body inside! | Sakshi
Sakshi News home page

ఫ్రీజర్ కొంటే.. డెడ్ బాడీ వచ్చింది

Jun 3 2016 4:09 PM | Updated on Aug 24 2018 5:25 PM

ఫ్రీజర్ కొంటే.. డెడ్ బాడీ వచ్చింది - Sakshi

ఫ్రీజర్ కొంటే.. డెడ్ బాడీ వచ్చింది

ఓ మహిళ చౌకగా వస్తోందని సెకండ్ హ్యాండ్ ఫ్రీజర్ కొనుగోలు చేయగా, అందులో మృతదేహం వచ్చింది.

వాషింగ్టన్: ఓ మహిళ చౌకగా వస్తోందని సెకండ్ హ్యాండ్ ఫ్రీజర్ కొనుగోలు చేయగా, అందులో మృతదేహం వచ్చింది. ఆమె ఫ్రీజర్ను ఇంటికి తీసుకెళ్లి డోర్ తెరిచి చూడగా, అందులో నరికిన మృతదేహం భాగాలు కనిపించాయి. ఈ భయంకర దృశ్యాన్ని చూసి ఆమె షాక్కు గురైంది. అమెరికాలో ఉత్తర కరోలినాలోని గోల్డ్స్బొరొలో సంచలన సంఘటన చోటు చేసుకుంది.

బాధితురాలు పక్కింటివాళ్ల గ్యారేజి నుంచి సెకండ్ హ్యాండ్ ఫ్రీజర్ కొనుగోలు చేసింది. దాదాపు రెండు వేల రూపాయలకు దీన్ని తీసుకుంది. పరిచయస్తులు కావడంతో ఆమె వారిపై నమ్మకంతో గ్యారేజిలో ఫ్రీజర్ డోర్ తెరిచి పరిశీలించలేదు. ఫ్రీజర్ను ఇంటికి తీసుకెళ్లి చూడగా, అందులో మృతదేహం కనిపించింది. భయంతో వణికిపోయిన ఆమె వెంటనే బయటకు పరిగెత్తింది. హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి విషయం చెప్పింది. చర్చ్ సండే స్కూల్ క్లాస్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని కొనుగోలు చేసినట్టు ఆమె చెప్పింది. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి  పరిశీలించారు. ఫ్రీజర్లోని మృతదేహాన్ని పక్కింటిచెందిన వృద్ధురాలిదిగా ఆమె గుర్తించారు. మృతురాలు కొన్నేళ్లుగా కుమార్తె దగ్గర ఉన్నట్టు తెలిపింది. పోలీసులు ఈ కేసును విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement