వచ్చేవారం భారత్ లో జాన్ కెర్రీ పర్యటన | US Secretary Of State John Kerry To Visit India, Next Week | Sakshi
Sakshi News home page

వచ్చేవారం భారత్ లో జాన్ కెర్రీ పర్యటన

Aug 25 2016 3:00 PM | Updated on Aug 25 2018 3:29 PM

అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ వచ్చే వారం భారత్ లో పర్యటించనున్నారు.

వాషింగ్టన్: అమెరికా విదేశాంగ మంత్రి  జాన్ కెర్రీ వచ్చే వారం భారత్ ను సందర్శించనున్నారు. ఈ  మేరకు అగ్రదేశం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 29 న జాన్ కెర్రీ బంగ్లాదేశ్ లో పర్యటించిన అనంతరం ఇండియా చేరుకుంటారు. ఆయన అగస్టు 31 వరకు ఇండియాలో పర్యటిస్తారు.

ఇరుదేశాల ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలపై చర్చించనున్నారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి పెన్నీ ప్రిట్జ్కర్ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పలు వాణిజ్య ఒప్పందాలపై  చర్చించనున్నారు. ఇరుదేశాల వ్యూహాత్మక, వాణిజ్య ఒప్పందాలను ఈ పర్యటన మరింత బలోపేతం చేయగలదని అమెరికా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement