వలసదారులపై బాష్పవాయువు

U.S. fires tear gas across Mexico border to stop migrants - Sakshi

టిజుయానా: మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాలనుకున్న వలసదారులను యూఎస్‌ సరిహద్దు దళాలు అడ్డుకున్నాయి. వీరిలో 25 మందిని అరెస్టు చేశాయి. నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో దాదాపు 100 మంది వలసదారులు అమెరికాలోకి చొరబడేందుకు యత్నించారని స్థానిక మీడియా పేర్కొంది. మెక్సికో సరిహద్దు నుంచి దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన 45 మంది వలసదారులను అడ్డుకున్నామని యూఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ మంగళవారం వెల్లడించింది. కొద్దిసేపటి తర్వాత వీరంతా సీబీపీ అధికారులపై రాళ్ల వర్షం కురిపించారని తెలిపింది. వలసదారులను అదుపు చేసేందుకు బాష్పవాయువు, పెప్పర్‌ స్ప్రేను వాడామని వివరించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top