పాక్‌ ప్రయాణాలు మానుకోండి: యూకే

UK Issues Travel Advisory To Avoid Travelling To Pakistan - Sakshi

లండన్‌: బ్రిటన్‌ గురువారం తమ పౌరులకు కీలక సూచనలు జరీ చేసింది. పాకిస్తాన్‌లో పర్యటించడం మానుకోమని ఫారెన్‌ అండ్‌ కామన్వెల్త్‌ ఆఫీస్‌(ఎప్‌సీవో), బ్రిటన్‌ సిటిజన్స్‌కు విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లేవారు.. ఎక్కువ ప్రాంతాలను సందర్శించకపోవడం మంచిదని పేర్కొంది. ముఖ్యంగా ఎల్‌వోసీ సమీప ప్రాంతాల్లో పర్యటించకూడదని తెలిపింది. పాకిస్తాన్‌లో రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్‌లు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్‌లకు దూరంగా ఉండాలని సూచించింది. 

బెలూచిస్తాన్‌, సింధూ గ్రామీణ, ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రాంతాలతోపాటు ట్రైబల్‌ ఏరియాల్లో పర్యటన రద్దు చేసుకోమని సలహానిచ్చింది. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండటంతోపాటు.. ప్రమాదం జరిగే ప్రాంతాల్లో పర్యటించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. కొన్ని ఫ్లైట్‌ రూట్‌లలో, విమానాశ్రయాలలో ఆంక్షలు ఉన్నందునా.. తాజా సమచారం కోసం సందర్శకులు తమ ఎయిర్‌లైన్స్‌ను సంప్రందించాలని తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top