ట్రంప్‌ టార్గెట్‌ రష్యా..

Trump Says Sanctions On Russia Will Remain - Sakshi

న్యూయార్క్‌ : రష్యాపై అమెరికా ఆంక్షలు కొనసాగుతాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. యూరల్‌లోని నిర్థిష్ట దేశాలకు అమెరికా బాసటగా నిలిచినా ఆ దేశాలు రష్యాకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘రష్యా నుంచి యూరప్‌ దేశాలను తాము కాపాడుతుంటే..ఆ దేశాలు మాత్రం ఇంధన వనరుల కోసం రష్యాకు బిలియన్‌ డాలర్లు చెల్లిస్తున్నాయి..ఇది ఎంత మాత్రం క్షేమకరం కాద’ని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ఇటలీ ప్రధాని గిసిప్పీ కాంటేతో వైట్‌హౌస్‌లో జరిగిన సంయుక్త సమావేశంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. నాటోకు సభ్య దేశాల ఆర్థిక సహకారం నిలిచిపోయిందని, నాటో నిర్వహణ సంక్లిష్టమవుతోందని అన్నారు. నాటో తిరిగి బలోపేతమవుతుందని అంటూ నాటో సభ్య దేశాలు అమెరికా పట్ల సరైన రీతిలో వ్యవహరించడం లేదని ట్రంప్‌ పునరుద్ఘాటించారు. నాటో వ్యయం అంతటినీ తమపై మోపడం తగదని అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top