అక్కడ చదివితే జాబ్‌ పక్కా..!

Times Higher Education employability rankings - Sakshi

ఈ విద్యాసంస్థల్లో చదివితే జాబ్‌ పక్కా.. చదువు పూర్తి కాగానే ఉద్యోగం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుందని అంటోంది టైమ్స్‌ సర్వే.. ఈ మేరకు ఉద్యోగ కల్పనలో ముందున్న టాప్‌ టెన్‌ యూనివర్సిటీలకు ‘టైమ్స్‌ హైయర్‌ ఎడ్యూకేషన్‌ ఎంప్లయిబిలిటీ ర్యాంకింగ్స్’ను ప్రకంటించింది. ఈ ర్యాంకుల్లో అమెరికాలోని టాప్‌ యూనివర్సిటీలు ముందంజలో ఉన్నాయి. ఇక్కడి విద్యాసంస్థల్లో చదువుకుంటున్నవారిలో 80 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపింది. ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

2017 సంవత్సరంలో ప్రపంచంలోని ఏ కాలేజీ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి అని సర్వే చేస్తే అమెరికాలోని కాలేజీలే అగ్ర స్థానాలలో నిలిచాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సైతం ఇక్కడ చదువుకున్న వారికే ఉద్యోగాలు ఇవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాయని తేలింది. అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్-టెన్‌ విద్యాసంస్థల్లో అమెరికా కాలేజీలు మొదటి మూడు స్థానాల్లో ఉండటం విశేషం.  మొదటి స్థానంలో కాలిఫోర్నియా ఇస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిలిచింది. ఇక్కడ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించిన అత్యుత్తమ విద్యాబోధన సాగడమే ఇందుకు కారణం అని సర్వే పేర్కొంది. రెండో స్థానంలో హార్వర్డ్‌ యూనివర్సిటీ, మూడో స్థానంలో కొలంబియా యూనివర్సిటీ నిలిచాయి. ఇక, యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ ఐదో స్ధానంలో, టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మ్యూనిచ్‌ ఎనిమిదో స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో తొమ్మిదో స్థానంలో నిలిచాయి.

టైమ్స్‌ హైయర్‌ ఎడ్యూకేషన్‌ ఎంప్లయిబిలిటీ.. టాప్‌టెన్‌ ర్యాంకులివే..

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top