breaking news
California Institute of Technology
-
'ప్రాధాన్యాలను' గుర్తించడమే గెలుపు
ఐదు ట్రిలియన్ డాలర్ల విలువైన తొలి, ఏకైక కంపెనీగా ‘ఎన్విడియా’ ఇటీవలే చరిత్ర సృష్టించింది. ఎన్విడియా సహ–వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన తైవానీస్–అమెరికన్ వ్యాపారవేత్త జెన్సెన్ హూవాంగ్ కాలిఫోర్నియాలోని ‘క్యాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (కాల్టెక్) పట్టభద్రులను ఉద్దేశించి చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం: ఇది నిజంగా సంతోషకరమైన రోజు. మీరంతా ‘కాల్టెక్’ నుంచి పట్టభద్రులవుతున్నారు. ఈ విద్యాలయంలో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరిన వారిలో కొందరు నన్నూ, మా సంస్థనూ ఎంతో ప్రభావితం చేశారు. ‘ఎన్విడియా’లోని ఇద్దరు చీఫ్ సైంటిస్టులు ఇక్కడి నుంచి వచ్చినవారే. నిజానికి, సలహాలు ఇవ్వడమంటే నాకు ఇష్టం ఉండదు. నేను ఇష్టపడిన ఉదంతాలను, జీవితాను భవాలను కొన్ని చెబుతాను. సలహాలు వాటిలోనే అంతర్లీనంగా ఉంటాయి. ప్రపంచంలో ఒక టెక్ కంపెనీకి ఇంత సుదీర్ఘ కాలంగా సీఈఓగా ఉన్నది బహుశా నేనే అనుకుంటా. నేను ఈ 31 ఏళ్ళ వృత్తి జీవితంలో ఎంచుకున్న రంగం నుంచి బయటపడకుండా చూసు కున్నాను. విసుగు చెందలేదు. ఉద్వాసనకు గురయ్యే పరిస్థితులు తెచ్చుకోలేదు. మేధాపరమైన నిజాయతీ, ఒదిగి ఉండటం మా కంపెనీని కాపాడాయని చెప్పగలను. ఏఐ వెంట పరుగెత్తాలి!‘కుడా’ అనే ప్రోగ్రామింగ్ మోడల్ తయారు చేసేందుకు మాకు 20 ఏళ్ళకు పైగా పట్టింది. అది నేడు కంప్యూటింగ్ రంగాన్ని విప్లవా త్మకంగా మారుస్తోంది. టెక్నాలజీ పరంగా ఎన్నో పర్యవసానాలకు దారితీయగల కృత్రిమ మేధ (ఏఐ) రంగంలోకి దిగాల్సిందిగా నేను గ్రాడ్యుయేట్లను ప్రోత్సహిస్తాను. ఏకకాలంలో, బహు ముఖాలుగా వికసనం పొందుతూ ముందుకు సాగుతున్న టెక్నాలజీ అదొక్కటే!ఏఐ వెంట నడవడం కాదు పరుగెత్తండని నేను ‘తైవాన్ యూనివర్సిటీ’ విద్యార్థులకు సూచించాను. ఏఐ విప్లవంతో మమేకం కండని చెప్పాను. ఆ తర్వాత, ఒక ఏడాది గడిచేటప్పటికే అది నమ్మలేనంతగా మారిపోయింది. ఈ అసాధారణ పరిణామాలను మీరు అంతర్ దృష్టితో అవగాహన చేసుకోవాలి. మీ ముందున్న ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్‌గా తీసు కుని ముందుకు సాగండి. ఆధునిక కంప్యూటింగ్ మూలాలు ఐబీఎం సిస్టమ్ 360లో ఉన్నాయి. నేను పుట్టిన ఏడాది తర్వాత, అది మార్కెట్లోకి వచ్చింది. చిప్‌ల రూపకల్పన నేర్చుకున్న 1980లలోని తొలి తరం వి.ఎల్. ఎస్.ఐ. ఇంజినీర్లలో నేనొకడిని. అప్పటి పాఠ్య పుస్తకాన్ని కాల్టెక్లో చదివినవారే తయారు చేశారు. ఆ పుస్తకం ఐసీ డిజైన్‌ను విప్లవీకరించింది. మా తరం సూపర్ జైంట్ చిప్‌లు డిజైన్ చేసేందుకు, అంతి మంగా సీపీయూ తయారీకి వీలు కల్పించింది. కంప్యూటింగ్‌లో బ్రహ్మాండమైన వృద్ధికి సీపీయూ బాటలు పర చింది. ప్రపంచం అంతకు ముందెన్నడూ చూడనంత సామూహిక ఉత్పత్తి మొదలైంది. అది పైకి కనిపించనిది. తేలిగ్గా కాపీ చేయదగి నది. అదే సాఫ్ట్వేర్. నేను మీలాగా విద్యార్థిగా ఉన్నప్పుడు అది చాలా స్వల్ప స్థాయిలో ఉంది. సాఫ్ట్‌వేర్‌ను విక్రయించి సొమ్ము చేసు కోవచ్చుననే భావన అప్పట్లో ఒక స్వైర కల్పన మాత్రమే. నేడు అది అత్యంత ముఖ్యమైన వస్తువు అయిపోయింది. ఎన్విడియా తీసుకొచ్చిన ‘కుడా’ ఫలితంగా కంప్యూటింగ్‌లో వచ్చిన వేగం మరింత ముందుకు సాగేందుకు తోవ చూపింది.అలెక్స్ నెట్‌కు శిక్షణ ఇచ్చేందుకు కొందరు ఎన్విడియాకు చెందిన ‘కుడా జీపీయూ’లను ఉపయోగించుకున్నారు. డీప్ లెర్నింగ్ ఆవిర్భవించింది. ఆ కీలక పరిణామం ఏఐ విప్లవానికి నాంది పలికింది. భారీ జీపీయూ క్లస్టర్లను నిర్మించకుండా డీప్ లెర్నింగ్‌కు ఉన్న పరిమితులను అన్వేషించేదెట్లా? వాటిని నిర్మించడానికి కోట్లాది డాలర్లు అవసరం. అంత ఖర్చు పెట్టినా ఫలితం ఉంటుందా? క్లస్టర్లను నిర్మించకపోతే, అది ఎప్పటికీ మనకు తెలియదు. వేలాది ఇంజినీర్లు డీప్ లెర్నింగ్ పైన, అడ్వాన్సింగ్, స్కేలింగ్ డీప్ లెర్నింగ్ పైన పదేళ్ళపాటు కృషి చేశారు. మా మొదటి ఏఐ సూపర్ కంప్యూ టర్ డీజీఎక్స్–1ను శాన్ఫ్రాన్సిస్కోలోని ఒక స్టార్టప్‌కు 2016లో అందించాం. ఏఐపై పనిచేస్తున్న నా స్నేహితుల బృందం ‘ఓపెన్ ఏఐ’ పేరుతో ఆ కంపెనీని నెలకొల్పింది. వాళ్లే ‘చాట్‌జీపీటీ’ తెచ్చారు.తోటమాలి నేర్పిన పాఠంఏఐలో తదుపరి అల రోబోటిక్స్ కాబోతోంది. రోబోలు, రోబో టిక్ వాహనాలు, హ్యూమనాయిడ్ రోబోలు, చివరకు రోబోలు కాప లాగా ఉండి నడిపించే భారీ గిడ్డంగులను నిర్మించే వందలాది కంపె నీలతో మేం కలసి పనిచేస్తున్నాం. కానీ, మా రోబోటిక్స్ పయనంలో చాలా ఎదురుదెబ్బలు తిన్నాం. డీప్ లెర్నింగ్ అంటే ఎవరికీ అర్థం కాని సమయంలో కలన గణితాన్ని ప్రాసెసింగ్ చేసే ప్రపంచపు మొదటి రోబోటిక్ కంప్యూటర్ను నిర్మించాం. మేం పరిస్థితులకు తగ్గట్లుగా ఒదిగిపోయే, మార్పు చెందే, చతికిల పడినా తిరిగి లేవ గలిగిన శక్తిని అభివృద్ధి చేసుకున్నాం. మా పిల్లలు చిన్న వయసులో ఉండగా, ఒక వేసవిని జపాన్‌లో గడిపాం. ఒక వారాంతంలో క్యోటో వెళ్ళి, సిల్వర్ టెంపుల్ చూశాం. అది ఆకర్షణీయమైన మోస్ గార్డెన్‌కు ప్రసిద్ధి. అక్కడ ఒక ఒంటరి తోటమాలిని గమనించాను. అక్కడ ప్రపంచంలో దాదాపు ప్రతి రకం నాచునూ పెంచుతారు. దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాను. ‘నిర్జీవంగా మారిన నాచును తొలగిస్తున్నాను’ అని జవాబిచ్చాడు. ‘కానీ మీ గార్డెన్ చాలా పెద్దది కదా!’ అన్నాను. ‘నేను 25 ఏళ్ళుగా ఈ తోట ఆలనాపాలనా చూస్తున్నాను. నాకు కావలసినంత సమయం ఉంది’ అని జవాబిచ్చాడు. జీవితంలో నేను నేర్చుకున్న అత్యంత సునిశితమైన పాఠాలలో అదొకటి. ఈ తోటమాలి తనకు వచ్చిన కళకు అంకితమయ్యాడు. మనమూ అదే బాటలో నడిస్తే, మనకు కావాల్సినంత సమయం ఉంటుంది. నేను చేయవలసిన పనుల ప్రాధాన్య క్రమాన్ని రాసుకుని, ప్రతి రోజూ ఉదయం, ఆ జాబితాలోని మొదటి పనితో ప్రారంభిస్తా.ఏ పని తర్వాత ఏ పని చేయాలన్న విషయంలో చాలా స్పష్టతతో ఉంటాను. నేను పనిలో ఉండగా ఎవరన్నా వచ్చి ఏదో చెప్పి లేదా అడిగి అవాంతరం కల్పించినా ‘నాకు చాలా సమయం ఉంది. నా పని పూర్తి చేసుకోగలను’ అని చెబుతాను.సూపర్ పవర్స్మనం పడే వేదనలు, కష్టాలు మన వ్యక్తిత్వాన్ని పటిష్ఠ పరు స్తాయి. ఒకటి కాకపోతే మరొకటి ప్రయత్నించి చూద్దామనే లక్షణం అలవడుతుంది. నా సామర్థ్యాలలో నేను ఎక్కువ విలువ ఇచ్చు కునేది నా ఇంటెలిజెన్స్‌కు కాదు. కష్టనష్టాలను భరించగల నా సహనశీలతకు; ఒకదాన్ని ఎంచుకున్న తర్వాత, ఆ పనిపై సుదీర్ఘమైన కాలం పనిచేయగల నా పట్టుదలకు; ఎదురు దెబ్బలను తట్టుకుని నిలబడగల శక్తికి; త్వరలోనే మరో అవకాశం రాబోతోందనే నా ఆశాభావానికి! వాటినే నేను నా ‘సూపర్ పవర్లు’గా పరిగణిస్తాను. మీకు కావాల్సింది కనుగొనగలరని భావిస్తున్నాను. మొదటి రోజునే ఒక నిర్ణయానికి వచ్చేయాలని అనుకోవద్దు. తక్కువ కాలంలోనే దాన్ని కనుగొనగలగడం కూడా ముఖ్యం కాదు. కానీ, మీ జీవిత కాలాన్ని అంకితం చేయడానికి ఒక పనిని మీరు కనుగొన గలరని ఆశిస్తున్నాను. మీ నైపుణ్యాలకు దానిలో పదును పెట్టుకోండి. అది మీ జీవితకాల కృషి కావాలి. చివరగా, చెప్పేది ఒక్కటే. జీవితంలో దేని తర్వాత ఏమిటో నిర్ణయించుకోవాలి. జీవితంలో అనేక సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. చేయవలసిన పనులు అనేకం ఉంటాయి. కానీ, ప్రాధాన్య క్రమాన్ని ఏర్పరచుకోండి. ముఖ్యమైన పనులు చేసేందుకు కావలసినంత సమయం చిక్కుతుంది. -
కాంతిని స్లోమోషన్లో చూడాలనుందా?
వాషింగ్టన్: కాంతిని అత్యంత స్లో మోషన్లో బంధించగల ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కెమెరాను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కెమెరా సెకనుకి 10 లక్షల కోట్ల ఫ్రేమ్స్‌ను కేప్చర్ చేయగలదని తెలిపారు. ఇంత వరకు అంతుచిక్కని కాంతి, పదార్థం మధ్య జరిగే చర్యల గురించి తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ కెమెరాను అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. కాంతి అధ్యయన శాస్త్రంలో ఇటీవల పుట్టుకొచ్చిన కొత్త ఆవిష్కరణల వల్ల జీవ, భౌతిక శాస్త్రాల్లో అతి సూక్ష్మ విశ్లేషణలకు కొత్త దారులు తెరుచుకున్నాయి. ఈ పద్ధతులను వినియోగించుకోవాలంటే, ఒకేసారి షార్ట్ టెంపోరల్ రిజల్యూషన్‌లో చిత్రాలను కచ్చితత్వంతో రికార్డు చేయాలి. అయితే ప్రస్తుతం ఉన్న ఇమేజింగ్ పద్ధతుల ద్వారా అల్ట్రాషార్ట్ లేజర్ పల్సస్ పద్ధతి ద్వారా ఈ విశ్లేషణలు చేయడం చాలా కష్టంతో కూడుకున్నది. కంప్రెస్డ్ అల్ట్రాఫాస్ట్ ఫొటోగ్రఫీ (కప్) టెక్నాలజీ కొంతమేరకు ఉపయోగకరంగా ఉన్నా.. పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా లేదని తెలిపారు. ఇప్పుడు ఈ టెక్నాలజీనే మరింత మెరుగుపర్చి నూతన సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సెకనుకు క్వాడ్రిలియన్ ఫ్రేమ్స్‌ను బంధించే ఫెమ్టో సెకండ్ సామర్థ్యమున్న కెమెరాకు స్థిర చిత్రాలను బంధించే మరో కెమెరాను జతచేశారు. దీంతో అత్యంత నాణ్యమైన చిత్రాలను సెకనుకి 10 ట్రిలియన్ల ఫ్రేమ్స్ వరకు బంధించవచ్చని కాల్టెక్ ఆప్టికల్ ఇమేజింగ్ లాబోరేటరీ(కాయిల్) డైరెక్టర్ లిహాంగ్ వాంగ్ వెల్లడించారు. టీ–కప్‌గా పిలిచే ఈ నూతన కెమెరా సాయంతో బయో మెడికల్, మెటీరియల్ సైన్స్, ఇతర విభాగాలకు అవసరమైన కొత్తతరం మైక్రోస్కోప్‌లను అభివృద్ధి చేయవచ్చని వాంగ్ తెలిపారు. ఈ కెమెరాను ఉపయోగించి తొలుత 25 ఫ్రేములలో 400 ఫెమ్టో సెకన్ల వ్యవధిలోనే కాంతి పుంజం ఆకారం, తీవ్రత, పరావర్తన కోణాన్ని పరిశీలించినట్లు చెప్పారు. దీని వేగాన్ని భవిష్యత్తులో సెకనుకు క్వాడ్రిలియన్ ఫ్రేములకు పెంచడానికి అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. -
మెదడుపై ఒంటరితనం ప్రభావం..
కాలిఫోర్నియా : ఒంటరితనం మెదడులో ఉత్పత్తయ్యే రసాయనాల్లో మార్పులకు కారణమై భయం, దుందుడుకు ధోరణులకు దారితీస్తుందని తాజా అథ్యయనం వెల్లడించింది. ఆధునిక జీవనశైలితో నలుగురిలో కలవడం తగ్గిపోవడంతో కుంగుబాటు, ఒత్తిడి పెరిగి తీవ్ర అనారోగ్యాల ముప్పు ముంచుకొస్తోందని పేర్కొంది. ఎలుకల్లో చేసిన పరిశోధనలో కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తేల్చిన అంశాలు మానసిక అస్వస్థతలను నివారించే క్రమంలో ముందడుగుగా భావిస్తున్నారు. గతంలో వృద్ధుల్లో ఒంటరితనం సమస్య వేధించేదని, ప్రస్తుతం 18 నుంచి 22 ఏళ్లలోపు యువతను ఒంటరితనం ఉక్కిరిబిక్కిరి చేస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు. ఒంటరితనం కుంగుబాటు, ఉద్వేగ సమస్యలకు దారితీయడంతో పాటు శారీరక అనారోగ్యాలపైనా ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. ఒంటరితనంతో బాధపడే వారు ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్‌ను అధికంగా విడుదల చేయడంతో శరరంలో వాపులకు కారణమవుతుందని పరిశోధకులు తేల్చారు. తీవ్రమైన ఒంటరితనానికి లోనవుతున్నామనుకునే వారిలో గుండె జబ్బులు, టైఫ్ టూ మధుమేహం, డిమెన్షియా వ్యాధుల ముప్పు అధికమని పరిశోధకులు తేల్చారు. -
అక్కడ చదివితే జాబ్ పక్కా..!
ఈ విద్యాసంస్థల్లో చదివితే జాబ్ పక్కా.. చదువు పూర్తి కాగానే ఉద్యోగం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుందని అంటోంది టైమ్స్ సర్వే.. ఈ మేరకు ఉద్యోగ కల్పనలో ముందున్న టాప్ టెన్ యూనివర్సిటీలకు ‘టైమ్స్ హైయర్ ఎడ్యూకేషన్ ఎంప్లయిబిలిటీ ర్యాంకింగ్స్’ను ప్రకంటించింది. ఈ ర్యాంకుల్లో అమెరికాలోని టాప్ యూనివర్సిటీలు ముందంజలో ఉన్నాయి. ఇక్కడి విద్యాసంస్థల్లో చదువుకుంటున్నవారిలో 80 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపింది. ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. 2017 సంవత్సరంలో ప్రపంచంలోని ఏ కాలేజీ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి అని సర్వే చేస్తే అమెరికాలోని కాలేజీలే అగ్ర స్థానాలలో నిలిచాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సైతం ఇక్కడ చదువుకున్న వారికే ఉద్యోగాలు ఇవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాయని తేలింది. అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్-టెన్ విద్యాసంస్థల్లో అమెరికా కాలేజీలు మొదటి మూడు స్థానాల్లో ఉండటం విశేషం. మొదటి స్థానంలో కాలిఫోర్నియా ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిలిచింది. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అత్యుత్తమ విద్యాబోధన సాగడమే ఇందుకు కారణం అని సర్వే పేర్కొంది. రెండో స్థానంలో హార్వర్డ్ యూనివర్సిటీ, మూడో స్థానంలో కొలంబియా యూనివర్సిటీ నిలిచాయి. ఇక, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఐదో స్ధానంలో, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ ఎనిమిదో స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తొమ్మిదో స్థానంలో నిలిచాయి. టైమ్స్ హైయర్ ఎడ్యూకేషన్ ఎంప్లయిబిలిటీ.. టాప్‌టెన్ ర్యాంకులివే.. -
ఆ వర్సిటీ డిగ్రీలకు.. డిమాండ్ కొంచెం ఎక్కువ..
కాలిఫోర్నియా: ఎంతో కష్టపడి డిగ్రీ పట్టాను పొందడం ఒక ఎత్తైతే, ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందడం నేటి యువతకు మరో సవాలే. అయితే కళాశాల్లో విద్యాబోధనే కాకుండా వృత్తి విషయాల్లో నైపుణ్యాన్ని కూడా పెంపొందిస్తూ ఉద్యోగ కల్పనలో కూడా ముందున్న టాప్ 10 యూనివర్సిటీల జాబితాను టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. ప్రపచవ్యాప్తంగా గ్రాడ్యుయేషన్ పూర్తవ్వగానే వెంటనే ఉద్యోగం లభించే ఉత్తమ టాప్ యూనివర్సిటీలను 'గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్ 2016' పేరిట జాబితాను విడుదల చేసింది. 20 దేశాల్లోని టాప్ 2500 సంస్థల యాజమాన్యాల ఒపీనియన్ ఆధారంగా, 34 దేశాల్లోని 150 యూనివర్సిటీల్లో విద్యనభ్యసించిన విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను పరిగణలోకి తీసుకొని జాబితాను తయారు చేశారు. తమ సంస్థల్లో ఉద్యోగం చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారు డిగ్రీ పట్టా పొందిన యూనివర్సిటీ వివరాలను పరిగణలోకి తీసుకొని యాజమాన్యాలు ఈ ఒపీనియన్ పోల్‌లో పాల్గొన్నాయి. ఈ జాబితాలో టాప్ 3 ర్యాంకులను అమెరికా కైవసం చేసుకుంది. ఏకంగా టాప్ 10 జాబితాలో 6 యూనివర్సిటీలు యూఎస్‌కు చెందినవి ఉండటం విశేషం. ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో అమెరికాకు చెందిన కాలిఫోర్నియా ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీలు నిలిచాయి. యూకేకు చెందిన రెండు జపాన్, జర్మనీకి చెందిన చెరో యూనివర్సిటీలకు ఈ జాబితాలో చోటు దక్కింది.ఇక, టాప్ 20లో చైనా, సింగపూర్, కెనడా, ఫ్రాన్స్‌లకు చెందిన యూనివర్సిటీలకు చోటు దక్కింది. ఉద్యోగాల కల్పనలో టాప్ 10 యూరివర్సిటీలు 1.కాలిఫోర్నియా ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూఎస్ 2.మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ), యూఎస్ 3.హార్వర్డ్ యూనివర్సిటీ, యూఎస్ 4.యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూకే 5.స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ, యూఎస్ 6.యేల్ యూనివర్సిటీ, యూఎస్ 7.యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, యూకే 8.యూనివర్సిటీ ఆప్ మ్యూనిచ్ 9.ప్రిన్స్టన్ యూనివర్సిటీ 10.యూనివర్సిటీ ఆఫ్ టోక్యో -
ఫ్లూటోకి ఆవల మరో గ్రహం!
సౌర కుటుంబంలోని 9 గ్రహాల్లో ఫ్లూటోని చిట్టచివరి గ్రహంగా ఇంతవరకు పరిగణిస్తున్నాం.. కాని అది సరికాదని ఫ్లూటోకి ఆవల కొన్ని లక్షల మైళ్ల దూరంలో పూర్తిస్థాయి గ్రహ లక్షణాలు గల గ్రహాన్ని కనుగొన్నామని కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఇద్దరు ఖగోళ శాస్త్రవేత్తలు బుధవారం వెల్లడించారు. కొత్తగా కనుగొన్న ఈ గ్రహం చుట్టూ దట్టమైన వాతావరణం ఆవహించి ఉందన్నారు. దీని ద్రవ్యరాశి భూమి కంటే 10 రెట్లు అధికంగా, ఫ్లూటో కంటే 4,500 రెట్లు ఎక్కువగా ఉందన్నారు. సూర్యుని చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి ఈ గ్రహానికి 10 నుంచి 20 వేల సంవత్సరాలు పడుతుందన్నారు.


