ఈ ఐఫోన్ ట్రిక్ మీకు తెలుసా?


మీరు ఐఫోన్ వాడుతున్నారా? కొన్నిసార్లు మీ ఐఫోన్ లో సిగ్నల్  ఫుల్ గా చూపిస్తూ.. కనీసం ఒక మెసేజ్ పంపినా వెళ్లడం లేదా? అయితే ఈ ట్రిక్ మీకోసమే. పైకి ఫుల్ గా సిగ్నల్ కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి ఉన్న సిగ్నల్ స్ట్రెంథ్ ఎంత అనేది ఈ ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు.



ఐఫోన్ లో సిగ్నల్ చూపే గీతలు (బార్స్) సిగ్నల్ రేంజ్ ను మాత్రమే తెలుపుతాయి. కానీ సిగ్నల్ సామర్థ్యాన్ని కాదు. కొన్నిసార్లు సిగ్నల్ రేంజ్ లో ఉండటంతో ఈ బార్స్ ఫుల్ గా కనిపిస్తాయి. కానీ మెసేజ్ చేయాలన్న, కాల్ చేయాలన్న మీ ఐఫోన్ స్ట్రగుల్ అవుతుంటుంది.



ఇలాంటి సమయంలో మీ ఐఫోన్ లోని సిగ్నల్ స్ట్రెంథ్ ఎంతో తెలుసుకోవడానికి ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే సరిపోతుంది.



  •  యాక్సెస్ ఫీల్డ్ టెస్ట్ మోడ్: ఇందుకు *3001#12345#*కి కాల్ చేయాలి. దీంతో మీ ఫోన్ ఫీల్డ్ టెస్ట్ మోడ్ లోకి మారుతుంది. సిగ్నల్ సంఖ్యరూపంలో కనిపిస్తుంది.

     

  •  ఇప్పుడు లాక్ బటన్ గట్టిగా నొక్కి.. పవర్ ఆఫ్ (స్విచ్ఛాఫ్) బటన్ కనిపించేవరకు ప్రెస్ చేయాలి.




  • దాదాపు ఆరు సెకండ్ల పాటు ఇప్పుడు హోమ్ బటన్ ను ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఫోన్ హోమ్ స్క్రీన్ లోకి వెళుతుంది. సిగ్నల్ స్ట్రెంథ్ నంబర్ రూపంలో ఉంటుంది. స్ట్రెంథ్, రేంజ్ ను మార్చి చూసుకోవాలంటే బార్స్ ను ట్యాప్ చేస్తే సరిపోతుంది.


  • సిగ్నల్ స్ట్రెంథ్ ఇలా కనిపిస్తుంది.

    మీకు సిగ్నల్ స్ట్రెంథ్ సంఖ్య నెగిటివ్ (రుణాత్మక) రూపంలో కనిపిస్తుంది.

    ఈ సంఖ్య జీరోకు చేరువగా ఉంటే మీ సిగ్నల్ స్ట్రెంథ్ చాలా బాగా ఉన్నట్టు అర్థం

    0 నుంచి -80 వరకు ఉంటే మంచి సిగ్నల్ ఉన్నట్టు భావిస్తారు.

    -100 నుంచి -120 మధ్య ఉంటే మీ ఐఫోన్ సిగ్నల్ చాలా దారుణంగా ఉన్నట్టు అర్థం



     

  • మళ్లీ బ్యాక్ రావాలంటే... మళ్లీ ఈ నెంబర్ (*3001#12345#* )ను డయల్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్ మాయమై.. మీరు మాములు మోడ్ లోకి వచ్చేస్తారు.


 

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top