ఈ ఉద్యోగాలు చాలా వేగంగా కనుమరుగు..

 These jobs are set to disappear fastest in the US - Sakshi

అమెరికాలో రాబోయే దశబ్ద కాలంలో 12 రకాల ఉద్యోగాలు చాలా వేగంగా కనుమరగవతున్నట్లు ఆ దేశ లేబర్‌ స్టాటస్టిక్స్‌ బ్యూరో అధికారులు తెలిపారు. దీనికి కారణం పెరుగుతున్న సాంకేతికత బయటి దేశాలకు అవుట్‌ సోర్సింగ్‌ ఇవ్వడమేనన్నారు. ముఖ్యంగా బుక్‌ కీపింగ్‌, అకౌంటింగ్‌, ఆడిటింగ్‌ క్లర్క్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌ వంటి ఉద్యోగాలు 2014-2019 మధ్య కాలంలో చాలా వరకు తగ్గిపోనున్నట్లు అంచనా వేస్తూ ఓ రిపోర్టును విడుదల చేశారు.
 

ఆ వివరాలు..
 బయటి దేశాల అవుట్‌ సోర్సింగ్‌ కారణంగా అమెరికాలో కంప్యూటర్‌ ప్రోగ్రామర్స్‌ ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. ఏడాదికి 80 వేల డాలర్లు పొందే ప్రోగ్రామర్స్‌ 2014 వరకు దేశంలో 3 లక్షల 29 వేల మంది ఉన్నారు. 2024 వరకు ఈ సంఖ్య 8 శాతం తగ్గి 3లక్షల 2 వేలకు చేరనుంది.
 
మోల్డింగ్‌, కోర్‌మేకింగ్‌, మెషిన్‌ సెట్టర్స్‌, ఆపరేటర్స్‌, టెండర్స్‌, మెటల్‌, ప్లాస్టిక్‌ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గనున్నాయి.  ఈ రంగ కంపెనీలన్ని కంప్యూటర్‌ రోబట్‌లపై ఆధారపడుతుండటంతో 32 వేలమంది ఉద్యోగ అవకాశాలు కోల్పోనున్నారు. ఈ రంగంలోని ఉద్యోగులు ఏడాదికి 29 వేల డాలర్లు వేతనంగా పొందుతుండగా.. 2014 లెక్కల ప్రకారం లక్షా 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు. 2024 వరకు ఈ సంఖ్య 97 వేలకు పడిపోనుంది.

స్విచ్‌ బోర్డు ఆపరేటర్స్‌, టెలీకాలర్స్‌ రంగంలో ఆటోమేషన్‌ కారణంగా ఉద్యోగ అవకాశాలు తగ్గనున్నాయి. ప్రస్తుతం లక్షా 12 వేల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతుండగా 2024 కల్లా ఈ సంఖ్య 76 వేలకు తగ్గనుంది.

పోస్టల్‌ సర్వీస్ మెయిల్‌ సోర్టర్స్‌‌,  ప్రాసెసర్స్‌, ప్రాసెసింగ్‌ మెషిన్‌ ఆపరేటర్స్‌ ఉద్యోగాలు కూడా ఆటోమేటిక్‌ మెయిల్‌ సోర్టింగ్‌ సాంకేతికతతో ప్రమాదంలో పడునున్నాయి. ఈ రంగంలోనికి ఉద్యోగులు ఏడాదికి 57 వేల డాలర్ల వేతనం పొందుతున్నారు. లక్షా 18 వేలమంది ఉపాధి పొందుతుండగా 2024 వరకు 78 వేలకు చేరనుంది. సుమారు ఈ రంగంలో 40 వేల ఉద్యోగ అవకాశాలు తగ్గనున్నాయి.

టెల్లర్స్‌: బ్యాంకింగ్‌ రంగంలో లావాదేవీలకు బాధ్యత వహించే ఈ ఉద్యోగులు.. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ ఆప్‌ల రావడంతో అవకాశాలు కోల్పోతున్నారు. 2014లో ఈ రంగంలో ఉపాధి పొందేవారి సంఖ్య 5 లక్షల 21 వేలుగా ఉండగా 2024 కల్లా ఈ సంఖ్య 481 వేలకు పడిపోనుంది.

♦ గార్మెంట్స్‌, డెకరేట్‌, గార్మెంట్స్‌, నాన్‌ గార్మెంట్స్‌ ఉత్పత్తులను తయారు చేసే కుట్టు యంత్ర ఆపరేటర్లు అవుట్‌ సోర్సింగ్‌, ఆటోమేషన్‌లతో ఉపాధి అవకాశాలు కోల్పోనున్నారు. 2014లో ఈ రంగంలో ఉపాధి పొందే సంఖ్య లక్షా 54 వేలుగా ఉండగా 27వేల ఉద్యోగ అవకాశాలు తగ్గనున్నాయి. ఇవే కాకుండా అసంఘటిత, అకౌంటింగ్‌, ఆహార సంబంధిత రంగాల్లో వేల ఉద్యోగాలు కోల్పోనున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top