‘క్షణాల్లో ఎంతటి నొప్పినైనా తగ్గిస్తుంది’ | The venom of one of world's deadliest snakes could relieve pain, say scientists | Sakshi
Sakshi News home page

క్షణాల్లో ఎంతటి నొప్పినైనా తగ్గించే పాము విషం

Oct 31 2016 8:18 PM | Updated on Jul 29 2019 5:43 PM

‘క్షణాల్లో ఎంతటి నొప్పినైనా తగ్గిస్తుంది’ - Sakshi

‘క్షణాల్లో ఎంతటి నొప్పినైనా తగ్గిస్తుంది’

భయంకరమైన నొప్పి నుంచి బయటపడాలంటే అత్యవసరంగా పనిచేసే సెడెటివ్‌ మాత్రలు వేసుకోవాల్సిందే.

సిడ్నీ: భయంకరమైన నొప్పి నుంచి బయటపడాలంటే అత్యవసరంగా పనిచేసే సెడెటివ్‌ మాత్రలు వేసుకోవాల్సిందే. అవి పనిచేయాలంటే కూడా కొంత సమయం పడుతుంది. వెంటనే పనిచేసే మాత్రల గురించి పరిశోధకులు నిరంతరం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు నిర్వర్తిస్నున్న విషయం తెల్సిందే. సెడెటివ్‌ మాత్రల తయారీలో పాము విషాన్ని విరివిగా ఉపయోగిస్తారు. నొప్పికి పాము విషమే మంత్రంగా పనిచేస్తుందికనుక ఎలాంటి పాము విషయం బాగా పనిచేస్తుందనే విషయమై ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ బ్య్రాన్‌ ఫ్రై పరిశోధనలు జరిపి విజయం సాధించారు.

‘కిల్లర్‌ ఆఫ్‌ ది కిల్లర్స్‌’గా వ్యవహరించే పాముకు ప్రపంచ పాముల్లోనే అత్యంత పొడౖÐð న విష గ్రంధులు ఉన్నాయని, ఇవి నిరంతరం శ్రవిస్తూనే ఉంటాయని, ఈ పాము విషాన్ని వినియోగించినట్లయితే మానువుల్లో నొప్పులు క్షణకాలంలో మటు మాయం అవుతాయని డాక్టర్‌ బ్య్రాన్‌ తెలిపారు. మూతి, తోక ఎరుపు రంగుతో ఉండి మిగతా శరీర భాగమంతా నీలి చారలతో ఈ పాము చూడముచ్చటగా∙ఉంటుందని ఆయన చెప్పారు. దీని శరీరం మొత్తం పొడువులో పావు భాగాన్ని విషపు గ్రంధులు ఆవరించి ఉంటాయని ఆయన తెలిపారు.

కింగ్‌ కోబ్రానే కాకుండా ఖడ్గమృగాలను సైతం చంపే శక్తి ఈ పాము విషానికి ఉందని, శత్రువులను క్షణాల్లో మట్టి కరిపించేందుకు ఈ పాము విషానికి వేగంగా పనిచేసే గుణం ఉందని ఆయన తెలిపారు. ఆగ్నేయాసియాలో కనిపించే ఈ పాములు ఇప్పుడు దాదాపు 80 శాతం అంతరించి పోయాయని, కేవలం 20 శాతం మాత్రమే మనుగడ సాగిస్తున్నాయని ఆయన తెలిపారు. తాను ఈ పాములను రెందుసార్లు మాత్రమే చూశానని కూడా చెప్పారు. దీన్ని విషాన్ని సేకరించి ఔషధంగా తయారు చేస్తే అది నొప్పి ప్రభావాన్ని మానవుడికి కలిగించే సోడియం ఛానళ్లను క్షణాల్లో మొద్దుబారుస్తుందని చెప్పారు. ఆయన చైనా, అమెరికా, సింగపూర్‌కు చెందిన నిపుణులతో కలసి జరిపిన ఈ పరిశోధనా విషయాలను ‘టాక్సిన్‌’ పత్రికలో ప్రచురించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement