
నిక్సీ.. ద ఫాలోవర్..
ఇదో వినూత్నమైన డ్రోన్. పేరు నిక్సీ. ఇప్పటివరకూ ఇలా చేతికి ధరించగలిగే డ్రోన్ ప్రపంచంలో మరొకటి లేదు. దీన్ని చేతికి వాచీలా ధరించొచ్చు.
ఇదో వినూత్నమైన డ్రోన్. పేరు నిక్సీ. ఇప్పటివరకూ ఇలా చేతికి ధరించగలిగే డ్రోన్ ప్రపంచంలో మరొకటి లేదు. దీన్ని చేతికి వాచీలా ధరించొచ్చు. చిన్న బటన్ నొక్కితే.. విచ్చుకుని మనల్ని ఫాలో అవుతుంది. నిక్సీలో మోషన్ సెన్సర్లు ఉంటాయి. ఇందులో ఉండే కెమెరా మనల్ని, చుట్టుపక్కల దృశ్యాలను చిత్రీకరిస్తుంది. సెల్ఫీలు తీస్తుంది. దీన్ని టైమర్ లేదా సంకేతాల ద్వారా నియంత్రించొచ్చు. పని పూర్తవగానే.. వచ్చి మళ్లీ చేతికి చుట్టేసుకుంటుంది.
నిక్సీని అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన భౌతిక శాస్త్ర పరిశోధకులు తయారుచేశారు. ఇంటెల్ ఏటా నిర్వహించే ‘మేక్ ఇట్ వేరబుల్’ పోటీ తుది జాబితాకు నిక్సీ ఎంపికైంది. దీంతో ప్రాథమిక నమూనాగా ఉన్న ఈ డ్రోన్‌ను ఉత్పత్తి చేసే అవకాశం వీరికి లభిస్తుంది.