యుద్ధానికి దిగినట్లుగా వేల సాలీడులు..

యుద్ధానికి దిగినట్లుగా వేల సాలీడులు..


బ్రిటన్: అదొక అటవీ ప్రాంతంతో నిండిన పార్క్ లాంటి ప్రదేశం. అందులో కొండలు. సరదాగా గడిపేందుకు తమ పిల్లలను తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు. సాధారణంగా స్వేచ్ఛగా ప్రకృతిలో విహరించే చిన్నారులంతా ఆ రోజు కూడా గంతులు వేస్తూ ఓ బండరాయి వద్దకు చేరుకున్నారు. దానికి చాలా చోట్ల రంధ్రాలు ఉన్నాయి. వాటిలో ఏమున్నాయా అని తొంగిచూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అందులో కుప్పలుకుప్పలుగా సాలీడు పురుగులు ఉన్నాయి. వాటిని చూడగానే భయంతో వణికిపోయారు.



ఇదే విషయం అక్కడ ఉన్న ఓ వ్యక్తికి చెప్పగా ఆశ్చర్యపోతూ.. ఒక వేళ సాలీడులు ఉన్నా అవేం చేయవని, భయపడాల్సిన పనిలేదంటూ వారి భయం పోగొట్టేందుకు ఆ రంధ్రంలో చేయిపెట్టి సాలీడు తుట్టెను కిందపడేశాడు. అంతే.. అందులోని వేలకొలది సాలీడు ఒక్కసారిగా దాడికి దిగినట్లుగా ఎగబాకడంతో భయంతో పిల్లలంతా పరుగులు తీశారు. దానిని బయటకు తీసిన వ్యక్తి కూడా వాటిని చూసి హడలెత్తిపోయాడు. కాసేపట్లోనే వేల సాలీడులు ఆ బండరాయిని చుట్టేశాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top