రెస్టారెంట్లోకి వెళ్లి పేల్చేసుకున్నాడు | Suicide Attack Kills At Least 14 In Baghdad, Say Iraqi Officials | Sakshi
Sakshi News home page

రెస్టారెంట్లోకి వెళ్లి పేల్చేసుకున్నాడు

Apr 4 2016 4:42 PM | Updated on Nov 6 2018 7:56 PM

రెస్టారెంట్లోకి వెళ్లి పేల్చేసుకున్నాడు - Sakshi

రెస్టారెంట్లోకి వెళ్లి పేల్చేసుకున్నాడు

ఇరాక్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆత్మాహుతి దాడికి పాల్పడి 14మంది ప్రాణాలు బలితీసుకున్నారు. దికార్ ప్రావిన్స్లోని ఓ రెస్టారెంట్లో ఈ దాడికి పాల్పడటంతో దాని గోడలన్నీ కూడా రక్తపు చారకలతో నిండిపోయాయి.

బాగ్దాద్: ఇరాక్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆత్మాహుతి దాడికి పాల్పడి 14మంది ప్రాణాలు బలితీసుకున్నారు. దికార్ ప్రావిన్స్లోని ఓ రెస్టారెంట్లో ఈ దాడికి పాల్పడటంతో దాని గోడలన్నీ కూడా రక్తపు చారకలతో నిండిపోయాయి. 14మంది మృతదేహాలు చిద్రంగా మారాయి. మరో 27మంది తీవ్రగాయాలపాలయ్యారు.

వీరిలో కాళ్లు చేతులు పూర్తిగా తెగిపోయినవారు కూడా ఉన్నారు. బాగ్దాద్ను కలిపి ఉండే ప్రధాన రహదారిపై ఉన్న రెస్టారెంటును లక్ష్యంగా చేసుకొని అనూహ్యంగా ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి దిగాడని పోలీసులు తెలిపారు. అయితే, ఏ సంస్థకు చెందిన ఈ దాడికి దిగిందో మాత్రం ఇంకా తెలియరాలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement