క్షణాల్లో మిలియన్ ఫ్రెండ్స్.. ఐదులక్షల లైక్లు | Stephen Hawking Amasses Over 1 Million Followers on New Weibo Account | Sakshi
Sakshi News home page

క్షణాల్లో మిలియన్ ఫ్రెండ్స్.. ఐదులక్షల లైక్లు

Apr 13 2016 4:08 PM | Updated on Apr 3 2019 8:07 PM

క్షణాల్లో మిలియన్ ఫ్రెండ్స్.. ఐదులక్షల లైక్లు - Sakshi

క్షణాల్లో మిలియన్ ఫ్రెండ్స్.. ఐదులక్షల లైక్లు

క్షణాల్లో మిలియన్ స్నేహితులను సంపాధించుకోవడం ఇప్పుడు సాధ్యమేనా.. సాధ్యమే అని నిరూపించారు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీపెన్ హాకింగ్.

బీజింగ్: క్షణాల్లో మిలియన్ స్నేహితులను సంపాధించుకోవడం ఇప్పుడు సాధ్యమేనా.. సాధ్యమే అని నిరూపించారు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీపెన్ హాకింగ్. చైనా వర్షన్కు చెందిన ట్విటర్ ఖాతాలో చేరిన కాసేపట్లోనే దాదాపు పది లక్షలమంది ఆయనను అనుసరించడం మొదలుపెట్టారు. ఆ సంఖ్య పెరుగుతుంది. భారత్లో ట్విట్టర్ వర్షన్ మాదిరిగా చైనాలో కూడా వైబో అనే ట్విటర్ మాధ్యమానికి చెందిన ఓ సామాజిక అనుసంధాన వేదిక ఉంది. అందులో హాకింగ్ మంగళవారం చేరారు.

ఆయన చేరిన క్షణాల్లోనే అనూహ్యంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. వారి సంఖ్య పది లక్షలు దాటిపోయింది. ఇక ఆయన చేసిన తొలి పోస్టింగ్కైతే ఏకంగా ఐదులక్షల లైక్లు వచ్చాయి. 'చైనాలోని నా స్నేహితులందరికి శుభాకాంక్షలు. సోషల్ మీడియా ద్వారా చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని కలుసుకోగలుగుతున్నాను. నాజీవితాన్ని గురించి నేను చేస్తున్న పని గురించి మీకు దీని ద్వారా తెలపాలని అనుకుంటున్నాను. దీంతోపాటు మీరు తిరిగి సమాధానం ఇవ్వడం ద్వారా ప్రశ్నించడం ద్వారా కూడా మిమ్మల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను' అని హాకింగ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement