‘ఇలా చేయమని దేవుడే చెప్పాడు’

South Korean Pastor Sentenced For Molesting His Followers - Sakshi

సియోల్‌ : దక్షిణా కొరియాలో వివాదాస్పద మత గురువుగా ముద్ర పడ్డ జియోరాక్‌ లీ(75) అనే వ్యక్తికి 15 ఏళ్ల శిక్ష విధిస్తూ గురువారం అక్కడి కోర్టు తీర్పునిచ్చింది. వివరాలు... మన్‌మిన్‌ సెంట్రల్‌ చర్చి పెద్దగా ఉన్న లీకి పెద్ద సంఖ్యలో అనుచరులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. కాగా తనను దేవుడిగా భావించే ఆ మహిళలపై లీ అత్యాచారానికి ఒడిగట్టేవాడు. దేవుడి ఆదేశాల మేరకే ఈ విధంగా చేస్తున్నానని వారిని హిప్నటైజ్‌ చేసేవాడు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ అకృత్యాలు వెలుగులోకి రావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. సుమారు 50 మంది మహిళలు, చిన్నారుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన లీకి 15 ఏళ్ల శిక్ష సరిపోదని, అయితే అతడి వయసు దృష్ట్యా ఈ మేరకు శిక్ష ఖరారు చేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

కాగా తనను తాను దేవుడినని చెప్పుకొంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నాడన్న ఆరోపణలతో కొరియా క్రిస్టియన్‌ కౌన్సిల్‌ లీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. కొరియా మినిస్ట్రీ అసోసియేషన్‌ కూడా అతడిపై వివాదాస్పద నాయకుడిగా ముద్రవేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top