ఆ దేశంలో ఇక పై ‘ నో మాస్క్‌, నో రైడ్’‌ పాలసీ | South Korea Launched No Mask No Ride Policy | Sakshi
Sakshi News home page

బస్సులు, టాక్సీలు ఎక్కాలంటే అక్కడ మాస్క్‌ తప్పనిసరి

May 26 2020 3:07 PM | Updated on May 26 2020 3:07 PM

South Korea Launched No Mask No Ride Policy - Sakshi

సియోల్‌: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో ఉన్నఅన్ని దేశాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి దేశాలన్ని లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ఇంకా చాలా దేశాలు మాస్క్‌లు ధరించే బయటకు రావాలన్న నిబంధనను అమలు చేస్తున్నాయి. మాస్క్‌లు ధరించకపోతే కొన్ని చోట్ల ఫైన్లు కూడా వేస్తున్నారు. ఇక తాజాగా సౌత్‌కొరియా కూడా బస్సులు, టాక్సీలలో ప్రయాణించాలంటే మాస్క్‌లు తప్పనిసరి చేస్తూ ‘నో మాస్క్‌, నో రైడ్’ ‌పాలసీని తీసుకువచ్చింది. దేశ రాజధాని సియోల్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో అక్కడి వారు ఎవరైనా బస్సులు, టాక్సీలలో ప్రయాణించాలంటే కచ్ఛితంగా మాస్క్‌ ధరించాల్సిందేనని అక్కడి ప్రభుత్వం ‘నో మాస్క్‌ నోరైడ్‌ పాలసీ’ని మంగళవారం తీసుకుచ్చింది. (అత్యాచారం కేసులో చిలుక సాక్ష్యం)

మాస్క్‌లేకుండా ఎవరైనా బస్సులు, టాక్సీలలో ప్రయాణించాలనుకుంటే వారిని అనుమతించవద్దని బస్సు, టాక్సీ డ్రైవర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో అక్కడి వారందరూ మొదటిరోజు మాస్క్‌లు ధరించి ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను అనుసరించారు. చాలా మంది ప్రభుత్వం సూచించిన మాస్క్‌లను కాకుండా గుడ్డతో తయారు చేసిన కాటన్‌ మాస్క్‌లను కూడా ధరించి రోడ్లపైకి వచ్చారు. సౌత్‌కొరియాలో మంగళవారం కొత్తగా 19 కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,225 కి చేరాయి. 

(కరోనా ఆరంభం మాత్రమే: ‘బ్యాట్‌​ ఉమెన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement