స్కూల్లో నగ్న నృత్యాలు.. సంప్రదాయమా?

South Africa Outrage Over Students Naked Dancing Segment  - Sakshi

జోహెన్స్‌బర్గ్‌: సంప్రదాయ నృత్యం పేరిట ఓ స్కూల్‌ యాజమాన్యం చేసిన పని దక్షిణాఫ్రికాలో రచ్చ మొదలైంది. ఓ ఈవెంట్‌లో నిర్వాహకులు విద్యార్థినిలతో నగ్న నృత్యాలు  చేయించారు. పైగా ఆ వీడియోలు మీడియాలో సైతం చక్కర్లు కొట్టడం గమనార్హం. ఘటనపై కొన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే... కేప్‌ ప్రొవిన్స్‌లో ఉన్న ఓ స్కూల్‌లో గత వారం ఈ ఘటన జరిగింది. చోయిర్‌ పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులు.. సాంప్రదాయిక ఖ్సోసా నృత్యంలో భాగంగా టాప్‌ లెస్‌గా మారి నృత్యాలు చేశారు. డప్పుల చప్పుళ్లకు లయబద్ధంగా నగ్న దేహాన్ని ఆడించటం ఈ నృత్యం ప్రత్యేకత. ఆ వీడియోలు మీడియాలో, సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యాయి. దీనిపై తల్లిదండ్రులుసహా ప్రజలు భగ్గుమన్నారు. అయితే వారేం పూర్తి నగ్నంగా దృశ్యాలు చేయలేదని, సంప్రదాయ నృత్యానికి అనుగుణంగా దుస్తులు ధరించారని స్కూల్‌ యాజమాన్యం చెబుతోంది.  ఘటనపై విద్యాశాఖ మంత్రి అంగీ మోట్షేగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ లైంగిక వేధింపులేనని ఆమె అన్నారు. దర్యాప్తునకు ఆదేశించిన ఆమె నివేదిక ఆధారంగా స్కూల్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు.

పోరాటం... ఇదిలా ఉంటే అర్థనగ్న దృశ్యాలు దక్షిణాఫ్రికా చరిత్ర, సంస్కృతిల్లో భాగమే. రీడ్‌ నృత్యాల పేరిట టాప్‌ లెస్‌గా ఉన్న అమ్మాయిలు రాజ వంశస్థుల ముందు నృత్యాలు చేయటం ఓ ఆనవాయితీగా ఉండేది. కానీ, తర్వాత ఆ సంప్రదాయాలు కనుమరుగు అయిపోయాయి. ఈ మధ్య కొన్ని జాతుల ప్రజలు తిరిగి ఆచరణలో తెచ్చేందుకు పోరాటాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న క్రమంలో(రోజుకు 150కి పైగా రేప్‌ కేసుల నమోదు) ఇలాంటి వాటిని ప్రొత్సహించలేమని, చట్టబద్ధం చేయటం కుదరదని ప్రభుత్వం తేల్చేసింది. ఆందోళనకారులకు కొన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ప్రతిఘటన ఎదురవుతోంది. ఇదిలా ఉండగానే ప్రస్తుత ఘటన చోటు చేసుకోవటం గమనార్హం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top