ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురి మృతి | Six killed in South Korean chemical factory explosion | Sakshi
Sakshi News home page

ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురి మృతి

Jul 3 2015 4:20 PM | Updated on Sep 3 2017 4:49 AM

ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురి మృతి

ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురి మృతి

దక్షిణ కొరియాలోని ఉల్సాలోని హన్వా కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు కార్మికులు అక్కడిక్కడే మంటల్లో కాలిబూడిదయ్యారు.

సియోల్: దక్షిణ కొరియాలోని  ప్రముఖ పారిశ్రామిక కేంద్రంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఉల్సాలోని హన్వా కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం పేలుడు సంభవించింది.  దీంతో ఆరుగురు  కార్మికులు అక్కడిక్కడే మంటల్లో కాలిబూడిదయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

 

కెమికల్ ట్యాంక్లోకి దిగి మరమ్మతు పనులు నిర్వహిస్తుండగా పేలుడు జరిగి ఉండొచ్చని అగ్రిమాపక అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఎంతమంది కార్మికులు ఈ మంటల్లో చిక్కుకున్నారు, వారిలో ఎంతమంది బతికి ఉండే అవకాశముందనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  మరోవైపు పేలుడుకు సంబంధించిన  కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement