అడ్డంగా బుక్కైన ఫేస్‌ బుక్‌ సీనియర్‌ ఉద్యోగి | Senior Facebook employee caught seeking unprotected sex from underage girl | Sakshi
Sakshi News home page

అడ్డంగా బుక్కైన ఫేస్‌ బుక్‌ సీనియర్‌ ఉద్యోగి

Dec 27 2016 3:34 PM | Updated on Jul 26 2018 5:23 PM

అడ్డంగా బుక్కైన ఫేస్‌ బుక్‌ సీనియర్‌ ఉద్యోగి - Sakshi

అడ్డంగా బుక్కైన ఫేస్‌ బుక్‌ సీనియర్‌ ఉద్యోగి

ఫేస్‌ బుక్‌ సీనియర్‌ ఉద్యోగి ఒకరు మైనర్‌ బాలికతో అసురక్షిత శృంగారం ఆశించి అడ్డంగా దొరికిపోయారు.

సీటెల్‌: ఫేస్‌ బుక్‌ సీనియర్‌ ఉద్యోగి ఒకరు మైనర్‌ బాలికతో అసురక్షిత శృంగారం ఆశించి అడ్డంగా దొరికిపోయారు. 15 బాలికతో శృంగారం జరిపేందుకు ఆయన 350 డాలర్లు చెల్లించేందుకు ముందుకు వచ్చి పోలీసులకు చిక్కాడు. ఈ వ్యవహారంలో ఒకులస్‌ కార్యాలయంలో ఫేస్‌ బుక్‌ కంప్యూటర్‌ విజన్ హెడ్‌ గా పనిచేస్తున్న డోవ్‌ కట్జ్‌ ను డిసెంబర్‌ 21న పోలీసులు అరెస్ట్‌ చేశారు. లక్షా 25 వేల డాలర్ల వ్యక్తిగత పూచికత్తుపై ఆయన బెయిల్‌ పొందారు.

వాస్తవానికి డోవ్‌ తో శృంగారానికి అంగీకరించిన బాలిక లేదు. పోలీసుల అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ లో భాగంగా ఇదంతా చేశారు. శృంగార నేరగాళ్లను పట్టుకునేందుకు టుక్‌ విలా పోలీసు శాఖ ఈ ఆపరేషన్‌ నిర్వహించింది. 19 ఏళ్ల యువతి పేరుతో డోవ్‌ కు పోలీసులు మెసేజ్‌ పంపారు. ఆమెతో ఏకాంతంగా గడిపేందుకు ఆయన అంగీకరించాడు. తన వయసు 15 ఏళ్లేనని చట్టపరంగా ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో వయసు ఎక్కువ చెప్పానని డోవ్ కు బాలిక పేరుతో సందేశం పంపారు. మైనర్ బాలిక అయినా తనకు ఓకే నని డోవ్‌ సమాధానమిచ్చాడు. ఆయనను ఓ హోటల్‌ కు రప్పించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇజ్రాయిల్‌ కు చెందిన డోవ్‌.. కాలిఫోర్నియాలో నివసిస్తున్నాడు. రోబోటిక్స్ లో పీహెచ్‌ డీ చేసి సొంత కంపెనీ పెట్టారు. ఈ సంస్థను ఫేస్‌ బుక్‌ లో కలిపేసి ఉన్నతస్థానంలో కొనసాగుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement