కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పుల కలకలం! | San Diego naval hospital on lockdown after gunshots reported | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పుల కలకలం!

Jan 26 2016 11:33 PM | Updated on Sep 3 2017 4:21 PM

కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పుల కలకలం!

కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పుల కలకలం!

గతేడాది భార్యాభర్తలు కాల్పులు జరిపి 14మందికి పైగా అమాయకులను పొట్టనపెట్టుకున్న శాన్ డియాగోలో మరోసారి కలకలం రేగింది.

కాలిఫోర్నియా: గతేడాది భార్యాభర్తలు కాల్పులు జరిపి 14మందికి పైగా అమాయకులను పొట్టనపెట్టుకున్న శాన్ డియాగోలో మరోసారి కలకలం రేగింది. మంగళవారం శాన్ డియాగో లోని నావల్ ఆస్పత్రిలో కాల్పులు జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసినట్లు తెలియగానే అధికారులు అప్రమత్తమయ్యారు.

మెడికల్ సెంటర్లో ఓ షూటర్ తిరుగున్నాడని అధికారులు అనుమానిస్తున్నారు. షూటర్ వార్త స్థానికంగా కలకలం సృష్టించడంతో ఆస్పత్రిని మూసివేసినట్లు ఓ అధికార ప్రతినిధి తెలిపారు. ఆస్పత్రి సిబ్బందిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి కొంత మందిని గాయపరిచినట్లు వివరించారు. ఆస్పత్రి బిల్డింగ్ వద్ద బలగాలు ఉన్నాయని, షూటర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement